సత్యంను వదిలిపెట్టని సీబీఐ

సత్యం కేసు నిందితులకు పడ్డ శిక్షపై సీబీఐ సంతృప్తిగా లేదు. నిందితులకు జైలు శిక్షపెంచాలంటూ కోర్టులో సీబీఐ రివ్యూ పిటిషన్ వేసింది. 14 ఏళ్ల పాటుశిక్ష విధించాలని పిటిషన్‌లో కోరింది. కొన్ని నెలల క్రితం ఈ కేసులో రామలింగరాజుతో పాటు తొమ్మిది మందికి ప్రత్యేక న్యాయస్థానం జైలు శిక్ష విధించింది. ప్రధాన నిందితులకు ఏడేళ్ల జైలు శిక్షను ఖరారు చేసింది. ఈ తీర్పుపై సంతృప్తిగా లేని సీబీఐ..  నాంపల్లి మెట్రోపాలిటన్ కోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. వేల కోట్ల కుంభకోణంలో కఠిన శిక్ష విధించని పక్షంలో ఆర్ధిక నేరాలకు పాల్పడే వారికి భయం ఉండదని సీబీఐ చెబుతోంది. కాబట్టి సత్యం కేసు నిందితులకు 14ఏళ్ల పాటు జైలు శిక్ష విధించాలని కోరింది.