Telugu Global
National

సాక్షీ మహారాజ్ మాటలు వినొద్దట

వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసే బీజేపీ ఎం.పి. సాక్షీ మహరాజ్ మాటలు వినకుండా ప్రధాన మంత్రి మోదీ, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింఘ్ మాటలకు మాత్రమే విలువ ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి అంటున్నారు. సాక్షీ మహారాజ్ లాంటి వారు ప్రభుత్వ అభిప్రాయాలకు ప్రాతినిధ్యం వహించరు అని కూడా గడ్కరి చెప్పారు. అయితే సాక్షీ మహా రాజ్ వ్యాఖ్యలు బీజేపీ అభిప్రాయలు కావని మాత్రం గడ్కరి చెప్పలేదు. మోదీ ప్రతిష్ఠ దెబ్బ తీయడానికి ప్రతిపక్షాల […]

సాక్షీ మహారాజ్ మాటలు వినొద్దట
X

వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసే బీజేపీ ఎం.పి. సాక్షీ మహరాజ్ మాటలు వినకుండా ప్రధాన మంత్రి మోదీ, కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింఘ్ మాటలకు మాత్రమే విలువ ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి అంటున్నారు. సాక్షీ మహారాజ్ లాంటి వారు ప్రభుత్వ అభిప్రాయాలకు ప్రాతినిధ్యం వహించరు అని కూడా గడ్కరి చెప్పారు. అయితే సాక్షీ మహా రాజ్ వ్యాఖ్యలు బీజేపీ అభిప్రాయలు కావని మాత్రం గడ్కరి చెప్పలేదు.
మోదీ ప్రతిష్ఠ దెబ్బ తీయడానికి ప్రతిపక్షాల వారు మైనారిటీ వర్గాలలో భయ సందేహాలను పెంపొందింప చేస్తున్నారని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ నేషనల్ హెరాల్డ్ కేసును ఆసరాగా చేసుకుని పార్లమెంటును స్తంభింప చేస్తూ దేశ అభివృద్ధికి అడ్డంకులు సృష్టిస్తోందని కూడా గడ్కరి దుయ్యబట్టారు. కాంగ్రెస్ పార్లమెంటులో లేవనెత్తుతున్న వివాదం కోర్టు కేసుకు సంబంధించిందని, దీనితో పార్లమెంటుకు కాని, ప్రభుత్వానికి కాని నిమిత్తం లేదని ఆయన స్పష్టం చేశారు.
ఎజెండా ఆజ్ తక్ 2015 లో చర్చలో పాల్గొంటూ గడ్కరి ఈ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. అదే చర్చలో పాల్గొన్న కాంగ్రెస్ నాయకుడు అశ్వినీ కుమార్ “మా నిరసనను వస్తు సేవల బిల్లుతో ముడిపెట్టకండి. అది మేం రూపొందించిన బిల్లే. దాని మీద మాకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. అయితే పార్లమెంటులో నిరసన తెలియజేయడానికి కారణం ప్రజాభిప్రాయం వ్యక్తం చేయడానికి పార్లమెంటు అత్యున్నత వేదిక” అని అన్నారు.

First Published:  11 Dec 2015 8:01 PM GMT
Next Story