Telugu Global
Others

మద్యం మరణాలపై బిసి మంత్రిని బలిచేస్తారా ?

మద్యం మరణాలు ఇపుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకీ కొత్తసమస్యలు తీసుకొచ్చి పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వానికి తలవంపులు తీసుకొచ్చింది.మద్యం మరణాలను కప్పిపుచ్చుకోవడానికి అనేక ఎత్తులు వేస్తోంది. దీనిలో భాగంగానే సిట్‌ బృందాన్ని ఏర్పాటుచేసింది. దీంతో ప్రజలు,ప్రజాతంత్రవాదులు,మహిళా సంఘాల దృష్టిని మళ్లించింది. ముఖ్యమంత్రి చాలా తెలివిగా సిట్‌ను వేసి, అందరి ఆలోచనల్ని పక్కదారి పట్టించారు. మరో పాచికను ముఖ్యమంత్రి వేయబోతున్నారు. ఎక్సైజ్‌ మంత్రి కొల్లురవీంద్రను బలిచేసేందుకు వ్యూహం రూపొందించారు. బిసి కులానికి చెందిన కొల్లు రవీంద్రను అనుకోనిరీతిలో మంత్రివర్గంలోకి తీసుకున్నారు. […]

మద్యం మరణాలపై బిసి మంత్రిని బలిచేస్తారా ?
X

మద్యం మరణాలు ఇపుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకీ కొత్తసమస్యలు తీసుకొచ్చి పెట్టింది. రాష్ట్ర ప్రభుత్వానికి తలవంపులు తీసుకొచ్చింది.మద్యం మరణాలను కప్పిపుచ్చుకోవడానికి అనేక ఎత్తులు వేస్తోంది. దీనిలో భాగంగానే సిట్‌ బృందాన్ని ఏర్పాటుచేసింది. దీంతో ప్రజలు,ప్రజాతంత్రవాదులు,మహిళా సంఘాల దృష్టిని మళ్లించింది. ముఖ్యమంత్రి చాలా తెలివిగా సిట్‌ను వేసి, అందరి ఆలోచనల్ని పక్కదారి పట్టించారు. మరో పాచికను ముఖ్యమంత్రి వేయబోతున్నారు. ఎక్సైజ్‌ మంత్రి కొల్లురవీంద్రను బలిచేసేందుకు వ్యూహం రూపొందించారు. బిసి కులానికి చెందిన కొల్లు రవీంద్రను అనుకోనిరీతిలో మంత్రివర్గంలోకి తీసుకున్నారు. పదవి ఇచ్చిన అయనను మంత్రిగా ఎపుడూ చూడలేదు. తల్లిచాటు బిడ్డగానే ఆయన వ్యవహరించాల్సి వస్తోంది. ఇపుడు ఏకంగా ఆయన్ని పదవినుంచి తప్పించేప్రయత్నాలు చేస్తున్నారు.

మద్యం మరణాలు ఎలా జరిగాయి?
ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మద్యం ద్వార వచ్చే ఆదాయంతోనే పాలనచేసేందుకు సిద్దం అయింది. ఇంతకు మించిన ఆదాయం మరే శాఖలోనూ లేకపోవడంతో అడ్డగోలుగా మద్యం అమ్మకాలనుప్రోత్సహిస్తోంది.నెలకు వెయ్యి కోట్లరూపాయల మేర ఆదాయం వచ్చేలా కృషి చేస్తోంది. ఫలితంగా నిబంధనలు గానీ, నిఘా,నియంత్రణ గానీ లేకుండామద్యం విచ్చల విడిగా అమ్మకాలు చేస్తోంది. మద్యం అమ్మకాల్లో జరిగే కల్తీలను కూడా ఏస్థాయిలోనూపట్టించుకునే నాధుడే లేకుండా పోయాడు. ఫలితంగానే విజయవాడలో కల్తీమద్యం తాగి ఐదుగురు చనిపోయారు. ఈవిషయం అధికారికంగానే దృ వీకరించారు. కల్తీమద్యం తాగడం వల్లనే ఐదురుగు చనిపోయారని శవపరీక్ష అనంతరం డాక్టర్లు ప్రాథమికనివేదికలో పొందుపరిచారు. ఇంకా ఫోరెన్సిక్‌ నివేదిక రావాల్సి ఉంది. అయితే ఈలోగా కల్తీమద్యంపై పోరాటానికి మహిళాసంఘాలు,వామపక్షాలు సమాయాత్తం అయ్యాయి. కార్యాచరణ రూపొందిస్తున్నాయి. ఈలోగానే ఆఘమేఘాల మీద ముఖ్యమంత్రి స్పందించారు. కల్తీలపై సిట్‌ బృందాన్ని నియమిస్తున్నామని, నివేదిక అందిన తర్వాత చర్యలు తీసుకుంటామని ఆయన ప్రకటించారు. ఇదంతా కల్తీపై చర్యలు తీసుకోవడానికి కాదని, కేవలం ప్రజలు చేపట్టే ఆందోళనను వాయిదా వేయడం కోసమే అని స్పష్టం అవుతోంది.మద్యం మరణాలు కేవలం కల్తీ వల్లనే జరిగాయి. కల్తీ మద్యం సరఫరా చేయడం వల్లనే ఇంత మంది ఏకసమయంలో మృతి చెందారు. కల్తీ జరిగిందని తెలిసినవెంటనే ప్రభుత్వం 9రకాల మద్యం బ్రాండ్లను తాత్కాలికంగా సరఫరాను నిలిపివేసింది. మద్యంషాపులను కూడా రెండురోజుల పాటు నిలిపి వేసింది.

మంత్రిని బలిచేస్తారా?
ఎక్సైజ్‌ మంత్రి కొల్లు రవీంద్రను తెలుగుదేశం నాయకులు బలిచేసేలా ఉన్నారు. పల్లెకారుల సామాజిక వర్గానికి చెందిన కొల్లు రవీంద్ర పార్టీలో ఎలాంటి లాబీ లేదు. ఆయన మామ మాజీమంత్రి నడకుదుటి నరసింహారావు(పెదబాబు) గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంత్రిగా పనిచేశారు. తరువాత ఆయన రాజకీయాల్లో అంత చురుగ్గాలేరు. ఆయన మేనల్లుడు,అల్లుడు అయిన కొల్లు రవీంద్రను తెలుగుయువత అధ్యక్షునిగా నియమించారు. ఆయన కృష్ణాజిల్లా కేంద్రంగా అనేక పోరాటాలు నిర్వహించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో నెరపిన పోరాటాల ఫలితంగా, సామాజిక వర్గానికి కేటాయించాల్సిన రిజర్వేషన్‌ వల్ల పల్లెకారులకు ఇచ్చే సీటును కొల్లుకు ఇచ్చారు. తీవ్ర పోటీ నేపథ్యంలో కూడా ఆయన గెలుపొందారు. సామాజిక అంశాల లెక్కలో ఆయనకు మంత్రి పదవిని ఇవ్వక తప్పలేదు. చాలా చిన్న వయసులో మంత్రి పదవిని దక్కించుకోవడం అందరికీ ఆశ్చర్యం వేసినా, ఆంధ్రాలోని కమ్మ నాయకత్వానికి మంత్రి ఏమాత్రం రుచించలేదు. అందులోనూ ఎక్సైజ్‌ మంత్రిగా ఇవ్వడంఅనేది జిల్లాకు చెందిన మంత్రులకే ఇష్టం లేదు. మద్యం వ్యాపారంలో ఉన్నదంత కమ్మనాయకత్వమే కావడం దీనికి కారణంగా పేర్కొంటారు. ఎలాగైనా సరే కొల్లును మంత్రి పదవి నుంచి తప్పించాలనే వ్యూహం ఆరంభం నుంచీ ఉంది.అయితే సమయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇంతలోనే మద్యం మరణాలు సంభంవించాయి. అదే రోజు ముఖ్యమంత్రి ఎక్సైజ్‌ మంత్రి, అధికారులతో సమీక్ష నిర్వహించారు. మంత్రిని నానా మాటలు అన్నారు. ” మంత్రిపదవి అంటే ఏమనుకున్నావ్‌‌? చేతకాకపోతేవెళ్లిపో…” అని ముఖ్యమంత్రి కూడా కొల్లును చీదరించుకున్నారు. దీంతో మిగిలిన కమ్మనాయకత్వానికి బలం పెరిగినట్లయింది. మద్యంకల్తీతోనే ఐదుగురు చనిపోయారని తేల్చారు.దీనికికారణం ఎక్సైజ్‌ మంత్రి అజమాయిషీ లేకపోవడమే అని తేల్చనున్నారు. ఇప్పటికే ప్రతిపక్షాలు సైతం ఎక్సైజ్‌ మంత్రిని రాజీనామాచేయాలని డిమాండ్‌ చేస్తున్నాయి. ఈపరిస్థితుల్లో కొల్లు రవీంద్రను బలిచేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొల్లు నుంచి ఎక్సైజ్‌ శాఖను అయినా తప్పించి మరో కమ్మ నేతకు అప్పగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

First Published:  12 Dec 2015 4:04 AM GMT
Next Story