Telugu Global
Others

పాక్‌ మిసైల్ రేంజ్‌లో భారత్

భారత్, పాకిస్థాన్ ల మధ్య మరోసారి ఆయుధ పోరు మొదలైంది. భారత్ కు ధీటుగా పాకిస్థాన్ కూడా ఖండాంతర క్షిపణులను సమకూర్చుకుంది. అయుధ పోటీలో భారత్ కు ఏమాత్రం తీసిపోమంటూ పాక్ షహీన్-త్రీ అనే బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించి పరీక్షించింది. ఉపరితలం నుంచి ఉపరితలం మీదకు ప్రయోగించే షహీన్-త్రీ క్షిపణి 2వేల 750 కిలోమీటర్ల దూరంలోని ఏ లక్ష్యాన్నైనా ఛేదిస్తుంది. దీనికి అణ్వాయుధాలను కూడా మోసుకెళ్లే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అంటే ఈ మిస్సైల్ ప్రయోగంతో […]

పాక్‌ మిసైల్ రేంజ్‌లో భారత్
X
భారత్, పాకిస్థాన్ ల మధ్య మరోసారి ఆయుధ పోరు మొదలైంది. భారత్ కు ధీటుగా పాకిస్థాన్ కూడా ఖండాంతర క్షిపణులను సమకూర్చుకుంది. అయుధ పోటీలో భారత్ కు ఏమాత్రం తీసిపోమంటూ పాక్ షహీన్-త్రీ అనే బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించి పరీక్షించింది. ఉపరితలం నుంచి ఉపరితలం మీదకు ప్రయోగించే షహీన్-త్రీ క్షిపణి 2వేల 750 కిలోమీటర్ల దూరంలోని ఏ లక్ష్యాన్నైనా ఛేదిస్తుంది. దీనికి అణ్వాయుధాలను కూడా మోసుకెళ్లే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. అంటే ఈ మిస్సైల్ ప్రయోగంతో పాకిస్థాన్ భారత్ లో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ ప్రాంతాన్ని అయినా టార్గెట్ చేయగలదు. అయితే భారత్ వద్ద ఇంతకు రెట్టింపు దూరంలోని లక్ష్యాలను ఛేదించే క్షిపణులు కూడా వున్నాయి.
షహీన్-త్రీ కి ముందు పాకిస్థాన్ ప్రయోగించిన షహీన్-1 రేంజ్ 900 కిలోమీటర్లు, షహీన్-2 రేంజ్ 1500 కిలోమీటర్లు. ఇప్పుడు షహీన్-3 ఏకంగా 2వేల 750 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది. ఈ క్షిపణి వ్యవస్థలో డిజైన్‌, సాంకేతిక పరిమితులు ఏ స్థాయిలో పనిచేస్తున్నాయో పరిశీలించేందుకే ఈ ప్రయోగ పరీక్ష జరిపినట్లు పాకిస్థాన్ ప్రకటించింది. ఈక్షిపణి ప్రయోగానికి పాక్ త్రివిధ దళాల ఉన్నతాధికారులు, సాంకేతిక నిపుణులు హాజరయ్యారు. ఈ ప్రయోగపరీక్ష విజయవంతం కావటం ద్వారా తమ దేశం అణ్వస్త్ర సామర్ధ్యంలో మరో మైలురాయిని అధిగమించిందని పాకిస్థాన్ రక్షణశాఖ ఉన్నతాధికారి లెఫ్టినెంట్‌ జనరల్‌ మఝర్‌ జమీల్‌ అన్నారు.
First Published:  12 Dec 2015 12:38 AM GMT
Next Story