Telugu Global
Others

సెక్స్ రాకెట్ " రెండుగా చీలిన టీడీపీ నేతలు!

తెలుగు గ్లోబల్‌.కామ్: విజయవాడలో వెలుగు చూసిన కాల్ మనీ సెక్స్ రాకెట్ టీడీపీలో కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో బెజవాడ టీడీపీ నేతలు రెండు వర్గాలు చీలిపోయారు. రాకెట్‌లో ప్రమేయం ఉన్న ప్రజాప్రతినిధుల పని పట్టేందుకు టీడీపీలోని మరోవర్గం పావులు కదుపుతోంది. ఒక మంత్రిని కూడా ఆ వర్గం టార్టెట్ చేస్తోంది. మంత్రితో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీపై చర్యలు తీసుకునేలా పార్టీ అధినాయకత్వంపై ఆ వర్గం తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తోంది. వందల కోట్ల వడ్డీవ్యాపారంతో ఎంతో మంది మహిళల […]

సెక్స్ రాకెట్  రెండుగా చీలిన టీడీపీ నేతలు!
X

తెలుగు గ్లోబల్‌.కామ్: విజయవాడలో వెలుగు చూసిన కాల్ మనీ సెక్స్ రాకెట్ టీడీపీలో కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో బెజవాడ టీడీపీ నేతలు రెండు వర్గాలు చీలిపోయారు. రాకెట్‌లో ప్రమేయం ఉన్న ప్రజాప్రతినిధుల పని పట్టేందుకు టీడీపీలోని మరోవర్గం పావులు కదుపుతోంది. ఒక మంత్రిని కూడా ఆ వర్గం టార్టెట్ చేస్తోంది. మంత్రితో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీపై చర్యలు తీసుకునేలా పార్టీ అధినాయకత్వంపై ఆ వర్గం తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తోంది. వందల కోట్ల వడ్డీవ్యాపారంతో ఎంతో మంది మహిళల జీవితాలతో ఆడుకున్న వారిని రక్షిస్తే పార్టీకి తీవ్రస్థాయిలో చెడ్డపేరు వస్తుందని ఆ వర్గం ఎమ్మెల్యేలు గట్టిగా వాదిస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకుంటే పార్టీ పరువు కొంతైనా దక్కుతుందని అంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా… బాధితులు ధైర్యంగా ముందుకొచ్చి ఫిర్యాదు చేయాలని కోరారు. ఎవరైనా బెదిరిస్తే అండగా తాము ఉంటాయని ధైర్యం చెప్పారు. వడ్డీకి డబ్బులిచ్చి మహిళలను వాడుకోవడం సిగ్గమాలిన చర్య అని మండిపడ్డారు. నిందితులు ఎంతటి వారైనా చర్యలు తీసుకోవాల్సిందేనని బోండా ఉమా చెప్పారు. కాల్ మనీ దందాలో టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్, టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు వాటాలు ఉన్నాయని కృష్ణా జిల్లా వైసీపీ నేత ఉదయభాను ఆరోపించారు.

Click to Read: సెక్స్‌రాకెట్ టీడీపీ నేతలు! జల్సా చేస్తున్న ఎమ్మెల్యే?

మరోవైపు కాల్ మనీ దందాలో కీలక సూత్రదారి వెనిగళ్ల శ్రీకాంత్‌తో కలిసి కృష్ణాజిల్లా పెనమలూరు టీడీపీ ఎమ్మెల్యే బోడే ప్రసాద్ విదేశాలకు విహారయాత్రకు వెళ్లారంటూ వస్తున్న కథనాలతో టీడీపీ మరింత చిక్కుల్లో పడింది. కొన్ని టీవీ చానళ్లు ఏకంగా విదేశాల్లో కాల్‌ మనీ సూత్రధారి వెనిగళ్ల శ్రీకాంత్‌తో కలిసి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ దిగిన ఫోటోలు అంటూ ప్రసారం చేస్తుండడంతో టీడీపీ నేతలకు దిక్కుతోచడం లేదు. ఎమ్మెల్యే బోడే ప్రసాద్, వెనిగళ్ల శ్రీకాంత్‌, కొందరు మహిళలు కలిసి దిగిన ఫోటోలను టీవీచానళ్లు ప్రసారం చేశాయి. ఫైనాన్స్‌ వ్యాపారంలో ముసుగులో సెక్స్‌ రాకెట్‌ నిర్వహిస్తూ పట్టుబడిన శ్రీరామ్మూర్తితో పాటు మరికొందర్నీ వదలేయాలంటూ కొందరు ప్రజాప్రతినిధులు పోలీసులపై ఒత్తిళ్లు తీసుకొచ్చారని సమాచారం. అయితే కేసు తీవ్రత దృష్ణ్యా తమ చేయి దాటిపోయిందని పోలీసులు చెబుతున్నట్టు తెలుస్తోంది.

First Published:  12 Dec 2015 2:40 AM GMT
Next Story