Telugu Global
Others

వందలాది మహిళల్ని  చెరబడుతున్నా స్పందించరా బాబు!

కాల్‌ మనీ ఉదంతంపై  వైసీపీ అధ్యక్షుడు జగన్‌ మోహన్ రెడ్డి ఎట్టకేలకు స్పందించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు ఒక బహిరంగ లేఖ రాశారు. కాల్ మనీపై ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుపట్టారు జగన్. కాల్‌ మనీ పేరిట పచ్చటి సంసారాల్లో చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు. కాల్ మనీ దందా వెనుక మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారన్న విషయం అందరికీ తెలుసన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులకు విజయవాడలో స్వాగతబ్యానర్లు కడుతున్నది కాల్ మనీ ముఠాయేనని తెలుస్తుంటే జనం గుండెలు దహించిపోతున్నాయన్నారు.  ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు కొలువైన విజయవాడలోనే ఇంత […]

వందలాది మహిళల్ని  చెరబడుతున్నా స్పందించరా బాబు!
X

కాల్‌ మనీ ఉదంతంపై వైసీపీ అధ్యక్షుడు జగన్‌ మోహన్ రెడ్డి ఎట్టకేలకు స్పందించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకు ఒక బహిరంగ లేఖ రాశారు. కాల్ మనీపై ప్రభుత్వ తీరును తీవ్రంగా తప్పుపట్టారు జగన్. కాల్‌ మనీ పేరిట పచ్చటి సంసారాల్లో చిచ్చుపెడుతున్నారని మండిపడ్డారు. కాల్ మనీ దందా వెనుక మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారన్న విషయం అందరికీ తెలుసన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులకు విజయవాడలో స్వాగతబ్యానర్లు కడుతున్నది కాల్ మనీ ముఠాయేనని తెలుస్తుంటే జనం గుండెలు దహించిపోతున్నాయన్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఉన్నతాధికారులు కొలువైన విజయవాడలోనే ఇంత నీచవ్యవహారం వెలుగు చూడడం దేశాన్నే నివ్వెరపరుస్తోందన్నారు. కాల్‌ మనీ ముఠా సొమ్ముతో టీడీపీ ప్రజాప్రతినిధులు విదేశీ పర్యటనలు చేయడం దారుణమైన అంశమన్నారు.

వందలాది మంది మహిళలను కాల్ మనీ ముఠా చెరబడుతున్నా ప్రతి చిన్న విషయానికి ప్రెస్ మీట్లు పెట్టే చంద్రబాబు ఇప్పుడెందుకు స్పందించడం లేదని నిలదీశారు. కాల్ మనీ సీఎం అండ చూసుకుని సాగిన రాక్షస క్రీడ కాబట్టి చంద్రబాబు బాధ్యత వహించాలని జగన్ డిమాండ్ చేశారు. టీడీపీ నేతలు ఎంతటి ఘోరం చేసినా చంద్రబాబు కాపాడుతున్నారన్న విషయం జనానికి బాగా అర్థమైపోయిందని జగన్ విమర్శించారు. అధిక వడ్డీలు చెల్లించలేని కుటుంబాల మహిళలను చెరబడుతున్న నీచులను బయటకు లాగి కఠినంగా శిక్షించాలని బహిరంగ లేఖలో జగన్ డిమాండ్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాల్సింది పోయి పక్కపార్టీలపై బురద చల్లడం దారుణమని జగన్ విమర్శించారు. చిత్తశుద్ది ఉంటే న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.

First Published:  14 Dec 2015 4:14 AM GMT
Next Story