Telugu Global
National

కేజ్రీవాల్ ఆఫీస్‌పై   సీబీఐ దాడులు

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కార్యాలయంలపై  సీబీఐ దాడులు కలకలం రేపుతున్నాయి.   సీఎంవోలో తనిఖీలు నిర్వహించిన సీబీఐ అధికారులు అనంతరం కార్యాలయాన్ని సీజ్ చేశారు. సీబీఐ దాడులు అంశాన్ని కేజ్రీవాల్ ధృవీకరించారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక మోదీ ఇలాంటి పిరికిపంద చర్యలకు దిగుతున్నారని ట్విట్టర్‌లో మండిపడ్డారు. ముఖ్యకార్యదర్శి కార్యాలయంతో పాటు తన కార్యాలయంపైనా సీబీఐ దాడులు చేసిందన్నారు. ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి ఆరోపించారు.  సీబీఐ అధికారులు మాత్రం దాడులు వెనుక ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని చెబుతోంది.  సీఎంవో ముఖ్యకార్యదర్శి రాజేంద్రసింగ్ […]

కేజ్రీవాల్ ఆఫీస్‌పై   సీబీఐ దాడులు
X

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కార్యాలయంలపై సీబీఐ దాడులు కలకలం రేపుతున్నాయి. సీఎంవోలో తనిఖీలు నిర్వహించిన సీబీఐ అధికారులు అనంతరం కార్యాలయాన్ని సీజ్ చేశారు. సీబీఐ దాడులు అంశాన్ని కేజ్రీవాల్ ధృవీకరించారు. రాజకీయంగా తనను ఎదుర్కోలేక మోదీ ఇలాంటి పిరికిపంద చర్యలకు దిగుతున్నారని ట్విట్టర్‌లో మండిపడ్డారు. ముఖ్యకార్యదర్శి కార్యాలయంతో పాటు తన కార్యాలయంపైనా సీబీఐ దాడులు చేసిందన్నారు. ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని ఢిల్లీ ఉపముఖ్యమంత్రి ఆరోపించారు.

సీబీఐ అధికారులు మాత్రం దాడులు వెనుక ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని చెబుతోంది. సీఎంవో ముఖ్యకార్యదర్శి రాజేంద్రసింగ్ కొన్నిప్రైవేట్ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారన్న ఫిర్యాదుల మేరకే దాడులు నిర్వహించామంటోంది. ఢిల్లీ సచివాలయంలోని మూడో అంతస్తులో సీఎం కార్యాలయం ఉంది. దానికి అనుబంధంగానే ముఖ్యకార్యదర్శి చాంబర్ ఉంది. మూడో అంతస్తును మొత్తం సీబీఐ తమ ఆధీనంలోకి తీసుకుంది. మోదీపై కేజ్రీవాల్ ఆరోపణలను కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఖండించారు. ప్రతి చిన్న విషయానికి మోదీని విమర్శించడం కేజ్రీవాల్‌కు అలవాటుగా మారిందని వెంకయ్య మండిపడ్డారు.

First Published:  15 Dec 2015 12:25 AM GMT
Next Story