Telugu Global
Cinema & Entertainment

చిరంజీవిని 25 సార్లు చెంప‌దెబ్బ కొట్టా!

చిరంజీవి 150వ సినిమాలో న‌టించాల‌నుకుంటున్న హీరోయిన్ల‌లో రాధిక ముందు వ‌రుస‌లో ఉంటారు. రాధిక‌-చిరంజీవి జంట అంటే తెలుగు ప్రేక్ష‌కుల‌కు క‌న్నుల పంటే. డాన్సులు- ఫెర్మామెన్స్‌ల్లో పోటీప‌డి న‌టిస్తారు. వీరిద్ద‌రు ఉంటే సినిమా హిట్టే అన్న‌ది తెలుగు నిర్మాత‌ల న‌మ్మ‌కం. రాధిక‌-చిరంజీవి ఆఫ్ స్ర్కీన్లోనూ మంచి మిత్రులు. అందుకే ఆయ‌న న‌టించే 150 సినిమాలో చిన్న‌పాత్ర అయినా స‌రే వేసేందుకు సిద్ధ‌మ‌ని చెబుతున్నారు. ఈ విష‌యాన్ని ఇటీవ‌ల ఓ టీవీ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో రాధిక స్వ‌యంగా వెల్ల‌డించారు. […]

చిరంజీవిని 25 సార్లు చెంప‌దెబ్బ కొట్టా!
X
చిరంజీవి 150వ సినిమాలో న‌టించాల‌నుకుంటున్న హీరోయిన్ల‌లో రాధిక ముందు వ‌రుస‌లో ఉంటారు. రాధిక‌-చిరంజీవి జంట అంటే తెలుగు ప్రేక్ష‌కుల‌కు క‌న్నుల పంటే. డాన్సులు- ఫెర్మామెన్స్‌ల్లో పోటీప‌డి న‌టిస్తారు. వీరిద్ద‌రు ఉంటే సినిమా హిట్టే అన్న‌ది తెలుగు నిర్మాత‌ల న‌మ్మ‌కం. రాధిక‌-చిరంజీవి ఆఫ్ స్ర్కీన్లోనూ మంచి మిత్రులు. అందుకే ఆయ‌న న‌టించే 150 సినిమాలో చిన్న‌పాత్ర అయినా స‌రే వేసేందుకు సిద్ధ‌మ‌ని చెబుతున్నారు. ఈ విష‌యాన్ని ఇటీవ‌ల ఓ టీవీ చాన‌ల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో రాధిక స్వ‌యంగా వెల్ల‌డించారు. రాధిక తొలి తెలుగు చిత్రం న్యాయంకావాలిలో చిరంజీవితోనే క‌లిసి న‌టించిన విష‌యాన్ని నెమ‌రువేసుకుంది. అప్పుడే తాను చిరంజీవిని చెంప‌పై కొట్టిన స‌న్నివేశాన్ని గుర్తు చేసుకున్నారు.
చిరంజీవి థ్యాంక్స్ చెప్పాడ‌ట‌!
ఆ సినిమాలో వీరిద్ద‌రి మ‌ధ్య ఓ విష‌మై తీవ్ర వాగ్వాదం జ‌రుగుతుంది. అలా మాట్లాతుండ‌గానే రాధిక పాత్ర చిరంజీవిని లాగి బ‌లంగా చెంప‌పై కొట్టాలి. అయితే, ఆ స‌న్నివేశంలో రాధిక స‌రిగా చేయ‌లేద‌ని ద‌ర్శ‌కుడు కోదండ‌రామిరెడ్డి మొత్తం 25 సార్లు చిరంజీవి చెంప‌పై కొట్టించార‌ట‌. 25వ‌ టేక్‌లో ఓకే చెప్పాడ‌ట డైరెక్ట‌ర్‌! షాట్ అయిపోగానే బుగ్గ‌లు వాచిపోయిన చిరంజీవి వ‌ద్ద‌కు వెళ్లి సారీ చెప్పాన‌ని, వెంట‌నే స్పందించిన చిరంజీవి ఇప్ప‌టికైనా షాట్ ఓకే చేయించి బ‌తికించావు త‌ల్లీ ! అని అన్నాడ‌ని గుర్తు చేసుకుంది రాధిక‌! మొత్తానికి ఇన్నేళ్ల సినీజీవితంలో చిరంజీవిని ఫైట్ సీన్ల‌లో విల‌న్లు కూడా అన్ని దెబ్బ‌లు కొట్టి ఉండ‌రేమో!
First Published:  14 Dec 2015 10:08 PM GMT
Next Story