Telugu Global
Cinema & Entertainment

బాబు బంగారం అంటున్న నయనతార

నయనతార దృష్టిలో ప్రస్తుతం గొప్పోడు ఒకడే. ఎవరు అత్యధిక పారితోషికం ఇస్తే అతడే ఈమె పాలిట బంగారం. తెలుగులో కూడా అదే విధంగా భారీ పారితోషికం అందుకొని మరీ వెంకీ సినిమాలో నటించేందుకు సిద్ధమౌతోంది నయన్. అయితే నయన్ దృష్టిలో వెంకీ సినిమా ప్రొడ్యూసర్ బంగారమే కాదు… ఆమె నటిస్తున్న సినిమాకు కూడా అదే పేరు ఫైనలైజ్ చేశారు. అవును… మారుతి-వెంకీ-నయన్ కాంబోలో రాబోతున్న సినిమాకు బాబు బంగారం అనే టైటిల్ ను ఫైనల్ చేసినట్టు చెబుతున్నారు. […]

బాబు బంగారం అంటున్న నయనతార
X
నయనతార దృష్టిలో ప్రస్తుతం గొప్పోడు ఒకడే. ఎవరు అత్యధిక పారితోషికం ఇస్తే అతడే ఈమె పాలిట బంగారం. తెలుగులో కూడా అదే విధంగా భారీ పారితోషికం అందుకొని మరీ వెంకీ సినిమాలో నటించేందుకు సిద్ధమౌతోంది నయన్. అయితే నయన్ దృష్టిలో వెంకీ సినిమా ప్రొడ్యూసర్ బంగారమే కాదు… ఆమె నటిస్తున్న సినిమాకు కూడా అదే పేరు ఫైనలైజ్ చేశారు. అవును… మారుతి-వెంకీ-నయన్ కాంబోలో రాబోతున్న సినిమాకు బాబు బంగారం అనే టైటిల్ ను ఫైనల్ చేసినట్టు చెబుతున్నారు.
నిజానికి ఏడాదిగా నలుగుతున్న ఈ సినిమాకు మొదట్నుంచి కూడా రాధ అనే టైటిల్ నే అనుకున్నారు. మారుతిని వెంకటేష్ కన్ ఫర్మ్ చేసినప్పుడు కూడా పత్రికల వాళ్లు ఈ ప్రాజెక్ట్ కు రాధ అనే పేరునే కొనసాగించారు. కనీసం పేరు మారుస్తారేమో అనే అనుమానం కూడా రాలేదు. కానీ అప్పటికే పాతచింతకాయపచ్చడిలా తయారైన రాథ పేరును మార్చేసి… సరికొత్తగా మరో పేరుతో వస్తే… కాస్త ఫ్రెష్ ఫీలింగ్ ఉంటుందని బావించి… ఈమధ్యంతా టైటిల్స్ వేటలో పడ్డాడు మారుతి. మొత్తమ్మీద 4 టైటిల్స్ సెట్ చేసి వెంకీకి వినిపిస్తే… అందులోంచి బాబు బంగారం అనే టైటిల్ ను ఫిక్స్ చేశాడట మన విక్టరీ.బాబు బంగారానికి నయనతార ఎక్స్ ట్రా సెంటిమెంట్ అన్నమాట. ఎందుకంటే… ఇంతకుముందు దగ్గుబాటి బాబుగారు, నయన్ కలిసి చేసిన లక్ష్మి, తులసి సినిమాలు రెండూ హిట్టయ్యాయి. ఆ నమ్మకంతో… ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ కొట్టేందుకు ధీమాగా సిద్ధమైపోతున్నాడు వెంకటేశ్. ఆల్ ది బెస్ట్ వెంకీ.
First Published:  14 Dec 2015 5:32 PM GMT
Next Story