Telugu Global
NEWS

హైదరాబాద్ లో మరో గూగుల్ క్యాంపస్

ప్రముఖ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ హైదరాబాద్ లో మరో కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. గూగుల్ సీఈవో బాధ్యతలు చేపట్టిన సుందర్ పిచాయ్ తొలిసారి స్వదేశానికి వచ్చారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా సుందర్ పిచాయ్ ఢిల్లీలో ఏర్పాటు చేసిన గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్ కు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామిక వేత్తలు, డెవలపర్లు, సాంకేతిక నిపుణులు, మీడియా రంగం ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈసందర్భంగా పిచాయ్ పలు కీలక నిర్ణయాలు వెల్లడించారు. భారత్ […]

హైదరాబాద్ లో మరో గూగుల్ క్యాంపస్
X
ప్రముఖ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ హైదరాబాద్ లో మరో కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. గూగుల్ సీఈవో బాధ్యతలు చేపట్టిన సుందర్ పిచాయ్ తొలిసారి స్వదేశానికి వచ్చారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా సుందర్ పిచాయ్ ఢిల్లీలో ఏర్పాటు చేసిన గూగుల్ ఫర్ ఇండియా ఈవెంట్ కు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామిక వేత్తలు, డెవలపర్లు, సాంకేతిక నిపుణులు, మీడియా రంగం ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈసందర్భంగా పిచాయ్ పలు కీలక నిర్ణయాలు వెల్లడించారు. భారత్ లో సాంకేతిక అవసరాల కోసం ప్రత్యేకంగా హైదరాబాద్ లో మరో కొత్త క్యాంపస్ నిర్మిస్తామన్నారు. అలాగే బెంగళూరులో మరిన్ని ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ ఐటీ శాఖమంత్రి కేటీఆర్ అమెరికా పర్యటనకు వెళ్లినపుడే శాన్ ఫ్రాన్సిస్కోలోని గూగుల్ కార్యాలయానికి వెళ్లారు. అప్పట్లోనే హైదరాబాద్ లో గూగుల్ సంస్థ విస్తరణకు ఒప్పందం కుదిరింది. దీంతో కేటీఆర్ కూడా హైదరాబాద్ కు మరో గూగుల్ క్యాంపస్ రానుందని అప్పట్లోనే ప్రకటించారు. ఇప్పుడు భారత్ పర్యటకు వచ్చిన సుందర్ పిచాయ్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశారు.
అంతేకాదు 2016లో అమెరికా కంటే భారత్ లోనే ఎక్కువ మంది ఆండ్రాయిడ్ ఫోన్ వినియోగదారులు ఉండబోతున్నారని పిచాయ్ తెలిపారు. వీరందరి కోసం 11 భారతీయ భాషల్లో టైప్ చేసేందుకు వీలుగా గూగుల్ ఇండిక్ కీ బోర్డును త్వరలోనే విడుదల చేస్తామని ప్రకటించారు. అంతేకాకుండా దేశ వ్యాప్తంగా మూడు లక్షల గ్రామాల్లో ఇంటర్నెట్ అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాట్టు చెప్పారు. ఇప్పటికే భారత్ లోని 400 రైల్వే స్టేషన్లలో గూగుల్ తరుఫున వైఫై సదుపాయం కల్పించాలని నిర్ణయించామన్నారు. అందులో వచ్చే ఏడాది డిసెంబర్ వరకు 100 రైల్వే స్టేషన్లలో వైఫై సదుపాయం కల్పిస్తామన్నారు. మొట్టమొదట ముంబైలో ఏర్పాటు చేస్తామన్నారు.
First Published:  15 Dec 2015 9:00 PM GMT
Next Story