Telugu Global
Cinema & Entertainment

ఎన్టీఆర్ పాటల సందడి లేనట్టేనా

నాన్నకు ప్రేమతో సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు యంగ్ టైగర్. ఈ సినిమాతో ఎలాగైనా 40కోట్ల క్లబ్ లోకి వెళ్లాలనేది తారక్ టార్గెట్. అందుకు తగ్గట్టే ప్రతి ఎలిమెంట్ ను చక్కగా క్యాష్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పటివరకు అంతా బాగానే జరిగింది. కానీ ఆడియో రిలీజ్ విషయంలోనే కాస్త అయోమయం ఏర్పడింది. ఈనెల 23న నాన్నకు ప్రేమతో పాటల్ని ఘనంగా విడుదలచేసి…. సినిమాకు మరింత హైప్ తీసుకురావాలనుకున్నారు. దేవిశ్రీప్రసాద్ తో అదిరిపోయే స్టేజ్‌ పెర్ ఫార్మెన్స్ ఇప్పించి అదరగొట్టాలనుకున్నారు. […]

ఎన్టీఆర్ పాటల సందడి లేనట్టేనా
X
నాన్నకు ప్రేమతో సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు యంగ్ టైగర్. ఈ సినిమాతో ఎలాగైనా 40కోట్ల క్లబ్ లోకి వెళ్లాలనేది తారక్ టార్గెట్. అందుకు తగ్గట్టే ప్రతి ఎలిమెంట్ ను చక్కగా క్యాష్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పటివరకు అంతా బాగానే జరిగింది. కానీ ఆడియో రిలీజ్ విషయంలోనే కాస్త అయోమయం ఏర్పడింది. ఈనెల 23న నాన్నకు ప్రేమతో పాటల్ని ఘనంగా విడుదలచేసి…. సినిమాకు మరింత హైప్ తీసుకురావాలనుకున్నారు. దేవిశ్రీప్రసాద్ తో అదిరిపోయే స్టేజ్‌ పెర్ ఫార్మెన్స్ ఇప్పించి అదరగొట్టాలనుకున్నారు. కానీ అంతలోనే బ్యాడ్ న్యూస్. దేవిశ్రీప్రసాద్ తండ్రి సత్యమూర్తి కన్నుమూశారు. సత్యమూర్తి కన్నుమూతతో అనివార్యంగా… ఎన్టీఆర్ సినిమా పాటల వేడుకను వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. పోనీ… దేవీ లేకుండానే కానిచ్చేద్దామనుకుంటే… ఆడియో ఫంక్షన్ కు ఆడియన్స్ అంతా దేవీని కచ్చితంగా ఎక్స్ పెక్ట్ చేస్తారు. మిగతా మ్యూజిక్ డైరెక్టర్ల ఆడియో ఫంక్షన్లకు ఒక విధంగా సంగీత దర్శకుడు లేకపోయినా వ్యవహారం నడిచిపోతుంది. కానీ దేవిశ్రీప్రసాద్ సినిమాల ఆడియో ఫంక్షన్లలో దేవీనే స్పెషల్ ఎట్రాక్షన్. మరి నాన్నకు ప్రేమతో పాటలు… అనుకున్న సమయానికి విడుదలవుతాయా…. దేవిశ్రీ ప్రసాద్ ఎప్పీయరెన్స్ ఉంటుందా…. దీనికి సమాధానం దేవిశ్రీప్రసాద్ మాత్రమే చెప్పగలడు.
First Published:  15 Dec 2015 7:03 PM GMT
Next Story