Telugu Global
National

రియ‌ల్ హీరోలంటే వీళ్లే...!

చెన్నై వరద బాధితుల కోసం సినీ పరిశ్రమ ప్రముఖులు ఇప్పటికీ స్పందిస్తునే ఉన్నారు. ఇప్పటికే టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు తమకు చేతనైన స్థాయిలో భారీ విరాళాలు ప్రకటించగా మరింతమంది నటీనటులు స్పందిస్తున్నారు. ముఖ్యంగా తమకు పెద్దగా సంబంధం లేకపోయినా బాలీవుడ్ ప్రముఖులు కూడా సాయం అందిచడంపై బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈమధ్యే షారూక్ ఖాన్, హృతిక్ రోషన్ తన సాయం ప్రకటించగా తాజాగా గబ్బర్ హీరో అక్షయ్ కుమార్ కూడా కోటి రూపాయల విరాళం […]

రియ‌ల్ హీరోలంటే వీళ్లే...!
X

చెన్నై వరద బాధితుల కోసం సినీ పరిశ్రమ ప్రముఖులు ఇప్పటికీ స్పందిస్తునే ఉన్నారు. ఇప్పటికే టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు తమకు చేతనైన స్థాయిలో భారీ విరాళాలు ప్రకటించగా మరింతమంది నటీనటులు స్పందిస్తున్నారు. ముఖ్యంగా తమకు పెద్దగా సంబంధం లేకపోయినా బాలీవుడ్ ప్రముఖులు కూడా సాయం అందిచడంపై బాధితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈమధ్యే షారూక్ ఖాన్, హృతిక్ రోషన్ తన సాయం ప్రకటించగా తాజాగా గబ్బర్ హీరో అక్షయ్ కుమార్ కూడా కోటి రూపాయల విరాళం ప్రకటించాడు.
త‌మిళ న‌టీ న‌టులు తమ ప్రాంతం కోసం మరింతగా స్పందిస్తున్నారు. ఏఆర్ రెహమాన్, అనిరుద్, యువన్ శంకర్ రాజా లాంటి సంగీత దర్శకులు సంగీత కార్యక్రమాలు నిర్వహించి వాటిద్వారా వచ్చే మొత్తాన్ని చెన్నై సహాయ కార్యక్రమాలకు వినియోగించాలని భావిస్తున్నారు. తమిళ స్టార్ హీరో సూర్య మరో అడుగు ముందుకేసి వరదల్లో పూర్తిగా దెబ్బతిన్న మూడు ప్రాంతాలను దత్తత తీసుకున్నాడు. ఇదే బాటలో స్టార్ డైరెక్టర్ మణిరత్నం కూడా ఒక ప్రాంతాన్ని దత్తత తీసుకుంటున్నట్టు ప్రకటించారు. న‌టులుగా కోట్లు సంపాదిస్తూ.. పెద్ద ఉప‌ద్ర‌వం వ‌చ్చిన‌ప్పడు మాన‌వ‌త్వంతో పెద్ద మ‌నుసు చూపుతున్న సెలిబ్రీట‌ల పై అభిమానం రెట్టింపు కాకుండ ఉంటుందా ఎవ‌రికైనా..!

First Published:  15 Dec 2015 1:02 PM GMT
Next Story