Telugu Global
Cinema & Entertainment

అమ్మాయిల మన్మధుడు కాస్తా రాక్షసుడు అయ్యాడు...

మన్మధ చిత్రంతో అమ్మాయిలకు చేరువయ్యాడు శింబు. ఆ తర్వాత ఏమాయచేశావె తమిళ వెర్షన్ తో మహిళా హృదయాల్ని కొల్లగొట్టాడు. శింబు అంటే పడిచచ్చిపోయే అమ్మాయిలు తమిళనాట కోకొల్లలు. ఇప్పుడదే అమ్మాయిలు శింబు కనిపిస్తే చంపి పారేయాలని చూస్తున్నారు. ఇదంతా శింబు చేసుకున్న స్వయంకృతాపరాధం. బీప్ సాంగ్ సృష్టిస్తున్న వివాదం. అవును… వరదలతో అతలాకులతం అవుతున్న చెన్నై నగరాన్ని… శింబు వదిలిన బీప్ సాంగ్ కూడా రెండో సారి అతలాకుతలం చేస్తోంది. ఈ పాట విన్న మహిళా లోకం […]

అమ్మాయిల మన్మధుడు కాస్తా రాక్షసుడు అయ్యాడు...
X
మన్మధ చిత్రంతో అమ్మాయిలకు చేరువయ్యాడు శింబు. ఆ తర్వాత ఏమాయచేశావె తమిళ వెర్షన్ తో మహిళా హృదయాల్ని కొల్లగొట్టాడు. శింబు అంటే పడిచచ్చిపోయే అమ్మాయిలు తమిళనాట కోకొల్లలు. ఇప్పుడదే అమ్మాయిలు శింబు కనిపిస్తే చంపి పారేయాలని చూస్తున్నారు. ఇదంతా శింబు చేసుకున్న స్వయంకృతాపరాధం. బీప్ సాంగ్ సృష్టిస్తున్న వివాదం.
అవును… వరదలతో అతలాకులతం అవుతున్న చెన్నై నగరాన్ని… శింబు వదిలిన బీప్ సాంగ్ కూడా రెండో సారి అతలాకుతలం చేస్తోంది. ఈ పాట విన్న మహిళా లోకం కుతకుతలాడుతోంది. శింబు కనిపిస్తే చెడామడా వాయించేయాలని వెదుకుతోంది. వరదల ధాటి నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న నగరంలో శింబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు వినిపిస్తున్నాయి. రాక్షసుడు శింబు అనే పోస్టర్లు కనిపిస్తున్నాయి. తన తాజా సినిమా కోసం శింబు… మ్యూజిక్ డైరక్టర్ కలిసి బీప్ సాంగ్ సృష్టించారు. మేం క్రియేట్ చేయలేదని వాళ్లు చెబుతున్నప్పటికీ అదే సత్యం. ఆ బీప్ సాంగ్ లో అన్నీ బీప్సే ఉంటాయి. సాహిత్యంలో ఒక వాక్యం ఉంటుంది. ఆఖర్లో లేదా మధ్యలో బీప్ అనే సౌండ్ వస్తుంది.
ఆ బీప్ లో ఏం ఉంటుందో అడల్ట్స్ అందరికీ తెలుస్తోంది. దీంతో మహిళా లోకం గయ్ మంది. కేవలం మహిళలే కాదు… ఇండస్ట్రీకి చెందిన ఎంతోమంది ప్రముఖులు ఈ వ్యవహారాన్ని ఖండిస్తున్నారు. వై.జి.మహేంద్ర లాంటి సీనియర్ నటులైతే బీప్ సాంగ్ సృష్టికర్తను ఊరేయాలంటూ స్టేట్ మెంట్లు కూడా ఇస్తున్నారు. పాపం… కొలవరి టైపులో బీప్ తో సెన్సేషన్ సృష్టిద్దామనుకున్న అనిరుధ్ కు ఇప్పుడు వివాదం చుట్టుకుంది. అటు ఈ డ్యామేజ్ ను భర్తీ చేసుకోవడానికి శింబుకు కూడా కనీసం పదేళ్లయినా పడుతుందనడంలో ఆశ్చర్యం లేదు.
First Published:  15 Dec 2015 7:02 PM GMT
Next Story