Telugu Global
Cinema & Entertainment

లోఫర్ నెక్ట్స్ సినిమా ఎవరితో ?

తన సినిమాల్లో  సెన్సేషన్ ఉందో లేదో తెలీదు కానీ…. నెక్ట్స్ సినిమా ఏ దర్శకుడితో చేస్తాడనే విషయంలో మాత్రం వరుణ్ తేజ సంచలనాల మీద సంచలనాలు సృష్టిస్తున్నాడు. డెబ్యూ మూవీకి ఎంతోమంది దర్శకుల్ని అనుకొని ఫైనల్ గా శ్రీకాంత్ అడ్డాలకు అప్పగించారు. అలా ముకుందాతో హీరో అయ్యాడు. రెండో సినిమా అవకాశం ఏ దర్శకుడిగా లభిస్తుందా అనే ఆలోచనల మధ్యలో అనూహ్యంగా క్రిష్ కు అవకాశం ఇచ్చాడు. అలా కంచె సినిమాతో హిట్ అందుకున్నాడు. ఇక మూడో […]

లోఫర్ నెక్ట్స్ సినిమా ఎవరితో ?
X
తన సినిమాల్లో సెన్సేషన్ ఉందో లేదో తెలీదు కానీ…. నెక్ట్స్ సినిమా ఏ దర్శకుడితో చేస్తాడనే విషయంలో మాత్రం వరుణ్ తేజ సంచలనాల మీద సంచలనాలు సృష్టిస్తున్నాడు. డెబ్యూ మూవీకి ఎంతోమంది దర్శకుల్ని అనుకొని ఫైనల్ గా శ్రీకాంత్ అడ్డాలకు అప్పగించారు. అలా ముకుందాతో హీరో అయ్యాడు. రెండో సినిమా అవకాశం ఏ దర్శకుడిగా లభిస్తుందా అనే ఆలోచనల మధ్యలో అనూహ్యంగా క్రిష్ కు అవకాశం ఇచ్చాడు. అలా కంచె సినిమాతో హిట్ అందుకున్నాడు. ఇక మూడో సినిమా దర్శకుడిగా పూరి జగన్నాధ్ కు ఛాన్స్ ఇచ్చి లోఫర్ గా మారిపోయాడు. ఇలా ఇప్పటివరకు చేసిన 3 సినిమాలకూ దర్శకుల విషయంలో వార్తల్లో వ్యక్తిగా మారాడు వరుణ్ తేజ. మరి ఇప్పుడు నాలుగో సినిమా ఎవరితో….?
వరుణ్ తేజ నాలుగో సినిమా కోసం నలుగురు దర్శకులు సిద్ధంగా ఉన్నారు. గోపీచంద్ మలినేని ఇప్పటికే ఈ మెగా హీరోకు కథ వినిపించాడు. మరోవైపు కొత్త కుర్రాడు వెంకీ అట్లూరి కూడా ఓ రొమాంటిక్ స్టోరీ వినిపించాడు. ఇంకోవైపు దేవ్ కట్టా దర్శకత్వంలో కూడా వరుణ్ నటిస్తాడనే ప్రచారం సాగుతోంది. ఈ రూమర్ల మధ్య లోకి క్రిష్ కూడా వచ్చిచేరాడు. మరోసారి క్రిష్ తోనే వర్క్ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచనలో కూడా ఉన్నాడట వరుణ్ తేజ. ఇలా నలుగురు దర్శకులు లైన్లో ఉన్న ఈ తరుణంలో… వరుణ్‌ తేజ ఈ నలుగుర్లో ఒకరికి ఛాన్స్ ఇస్తాడా…లేక ఎప్పట్లానే తన పాత పద్ధతిలో అనూహ్యంగా మరో దర్శకుడ్ని తెరపైకి తెస్తాడా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
First Published:  15 Dec 2015 7:04 PM GMT
Next Story