Telugu Global
Cinema & Entertainment

2017లో ‘అవతార్ 2’

ఆరేళ్ల క్రితం జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ‘అవతార్’ ఎంత మెప్పించిందో తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ సినిమాకు సీక్వెల్ చేస్తానని కామెరూన్ ఎప్పుడో ప్రకటించారు. అభిమానుల నిరీక్షణ ఫలించనుంది.‘‘మూడు స్క్రిప్టులకు తుది మెరుగులు దిద్దుతున్నాం. ప్రొడక్షన్ డిజైనింగ్ పనులు చూస్తు న్నాం. ఇక, చిత్రీకరణే ఆలస్యం. 2017 డిసెంబర్‌లో రిలీజ్ అనుకుంటున్నాం’’ అని కామెరూన్ తెలిపారు. ద‌ర్శ‌కుడిగా  జేమ్స్ కెమురూన్ అంటే ప్ర‌పంచ వ్యాప్తంగా   ఒక క్రియేట‌ర్ అనే  గుర్తింపు వున్న వ్య‌క్తి. […]

2017లో ‘అవతార్ 2’
X

ఆరేళ్ల క్రితం జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ‘అవతార్’ ఎంత మెప్పించిందో తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన ఈ సినిమాకు సీక్వెల్ చేస్తానని కామెరూన్ ఎప్పుడో ప్రకటించారు. అభిమానుల నిరీక్షణ ఫలించనుంది.‘‘మూడు స్క్రిప్టులకు తుది మెరుగులు దిద్దుతున్నాం. ప్రొడక్షన్ డిజైనింగ్ పనులు చూస్తు న్నాం. ఇక, చిత్రీకరణే ఆలస్యం. 2017 డిసెంబర్‌లో రిలీజ్ అనుకుంటున్నాం’’ అని కామెరూన్ తెలిపారు.

ద‌ర్శ‌కుడిగా జేమ్స్ కెమురూన్ అంటే ప్ర‌పంచ వ్యాప్తంగా ఒక క్రియేట‌ర్ అనే గుర్తింపు వున్న వ్య‌క్తి. ఆయ‌న చిత్రాల‌కు ఆయ‌నే స్వ‌యంగా కొత్త టెక్నాల‌జీ తో కెమెరాలు త‌యారు చేసుకుంటారు. టైటానిక్ చిత్రం త‌రువాత జేమ్స్ కెమ‌రూన్ దాదాపు 12 సంవ‌త్స‌రాలు స‌మ‌యం తీసుకుని చెక్కిన అవ‌తార్ ప్ర‌పంచ వ్యాప్తంగా క‌లెక్ష‌న్ల ప‌రంగా హాలీవుడ్ ఆల్ టైమ్ రికార్డ్ కొట్టింది. గ‌తంలో ఆయ‌న చేసిన టైటానిక్ చిత్రం సృష్టించిన రికార్డ్స్ ను అవతార్ బ్రేక్ చేసింది. నిజంగా అవ‌తార్ సీక్వెల్స్ కోసం ప్ర‌పంచ సినిమా అభిమానులు ఎంత‌గానో నీరీక్షిస్తున్నారు. వాళ్ల నీరీక్ష‌ణ మ‌రి కొంత కాలం త‌ప్ప‌దు మ‌రి.

First Published:  16 Dec 2015 7:06 PM GMT
Next Story