బ్రహ్మోత్సవాన్ని వదిలించుకోవడానికి చూస్తున్నాడా ?

ఎంతో ఇష్టపడి బ్రహ్మోత్సవం సినిమా ఒప్పుకున్నాడు. ఎన్నో క్రేజీ ప్రాజెక్టులు చేతిలో ఉన్నప్పటికీ… శ్రీకాంత్ అడ్డాలకు కాల్షీట్లు ఇచ్చాడు. తనకు ఇష్టంలేనప్పటికీ ముగ్గురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ కు సిద్ధమైపోయాడు. కానీ ఇంతలోనే బ్రహ్మోత్సవంపై విరక్తి పెంచుకున్నాడట మహేష్. వీలైనంత త్వరగా ఆ సినిమా నుంచి బయటపడాలని చూస్తున్నాడట. మహేష్ కు బ్రహ్మోత్సవంపై నమ్మకం పోవడానికి కారణాలేంటనేది మాత్రం ఎవరికీ అంతుచిక్కడం లేదు.
దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, మహేష్ బాబుకు మధ్య విబేధాలు వచ్చాయనే వార్తలు కొన్ని రోజులుగా నలుగుతూనే ఉన్నాయి. మహేష్ కు బ్రహ్మోత్సవంపై ఆసక్తి తగ్గడానికి అది కూడా ఒక కారణం అంటున్నారు. కానీ ఫిలిం యూనిట్ మాత్రం ఈ వార్తల్ని ఖండిస్తోంది. మరోవైపు శ్రీకాంత్ అడ్డాల సినిమాను కావాలనే సాగతీస్తుండండం కూడా మహేష్ కు నచ్చలేదని తెలుస్తోంది. ఇవన్నీ ఒక ఎత్తయితే… 
మరోవైపు మురుగదాస్ దర్శకత్వంలో ఓ సినిమాకు కమిట్ అయ్యాడు సూపర్ స్టార్. వీలైనంత తొందరగా ఆ సినిమా సెట్స్ పైకి జంప్ అవ్వాలనుకుంటున్నాడు. అందుకే బ్రహ్మోత్సవాన్ని త్వరగా ముగించాలనుకుంటున్నాడు. ఊటీలో ఎముకలు కొరికే చలిలో కూడా షూటింగ్ క్యాన్సిల్ చేయకుండా…రీటేక్స్ తీసుకోకుండా పని కానిచ్చేస్తున్నాడట మహేష్.