Telugu Global
NEWS

రెండో రోజూ కాల్‌మనీ మంటలు- సెక్స్‌రాకెట్ సెగలు

అసెంబ్లీని రెండోరోజూ కాల్‌మనీ సెక్స్‌రాకెట్ అంశం కుదిపేసింది. కాల్మనీపై చర్చకు వైసీపీ పట్టుబడగా ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. అంబేద్కర్ రాజ్యాంగంపై చర్చించిన తర్వాతే కాల్‌మనీపై ప్రకటన చేస్తామని తేల్చిచెప్పింది. దీంతో వైసీపీ సభ్యులు పోడియంను చుట్టుముట్టారు. ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. అసలు ప్రతిపక్ష సభ్యులకు కాల్ మనీపై చర్చించే నైతిక హక్కే లేదని మంత్రులు యనమల, అచ్చెన్నాయుడు మండిపడ్డారు. సీఎం ప్రకటన చేసేసిన తర్వాత ఇక చర్చించడానికి ఏముంటుందని జగన్ ప్రశ్నించారు. ప్రభుత్వానికి కామన్‌సెన్స్ లేకుండా […]

రెండో రోజూ కాల్‌మనీ మంటలు- సెక్స్‌రాకెట్ సెగలు
X

అసెంబ్లీని రెండోరోజూ కాల్‌మనీ సెక్స్‌రాకెట్ అంశం కుదిపేసింది. కాల్మనీపై చర్చకు వైసీపీ పట్టుబడగా ప్రభుత్వం అందుకు అంగీకరించలేదు. అంబేద్కర్ రాజ్యాంగంపై చర్చించిన తర్వాతే కాల్‌మనీపై ప్రకటన చేస్తామని తేల్చిచెప్పింది. దీంతో వైసీపీ సభ్యులు పోడియంను చుట్టుముట్టారు. ప్లకార్డులు ప్రదర్శించి నినాదాలు చేశారు. అసలు ప్రతిపక్ష సభ్యులకు కాల్ మనీపై చర్చించే నైతిక హక్కే లేదని మంత్రులు యనమల, అచ్చెన్నాయుడు మండిపడ్డారు. సీఎం ప్రకటన చేసేసిన తర్వాత ఇక చర్చించడానికి ఏముంటుందని జగన్ ప్రశ్నించారు. ప్రభుత్వానికి కామన్‌సెన్స్ లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంబేద్కర్‌ను రాజకీయాల కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. అంబేద్కర్‌ గురించి చర్చించాలంటే సభను పొడిగించాలని డిమాండ్ చేశారు. మరో రెండు రోజులు సమావేశాలు పొడిగించి ఆ రెండు రోజులు అంబేద్కర్‌పైనే చర్చిద్దామని సూచించారు. కావాలని అసెంబ్లీని స్తంభింపచేసేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తోందని యనమల మరోసారి విమర్శించారు. సభను అడ్డుకుంటే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. సభ అదుపుతప్పడంతో స్పీకర్‌ పది నిమిషాల పాటు వాయిదా వేశారు.

First Published:  17 Dec 2015 10:56 PM GMT
Next Story