సిగ్గుండాలి… ముద్దాయి ముఖ్యమంత్రే ప్రకటన చేయడానికి!

కాల్‌మనీ వ్యవహారం అసెంబ్లీని కుదిపేసింది. అటు సీఎం, ఇటు ప్రతిపక్ష నేత ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకున్నారు. అసెంబ్లీ జరుగుతున్న తీరు కౌరవసభను తలపిస్తోందని విమర్శించారు. కాల్‌మనీలో చంద్రబాబే ముద్దాయిగా ఉన్నారని జగన్ ఆరోపించారు. కాల్‌మనీ నిందితులతో చంద్రబాబు ఉన్న ఫోటోలను ప్రదర్శించారు. ముద్దాయిగా ఉన్న ముఖ్యమంత్రి చేత స్టేట్‌మెంట్‌ ఎలా ఇప్పిస్తారంటూ నిలదీశారు. ఇలాంటి సభను తన జీవితంలో చూడలేదని చెప్పారు. సెక్స్‌రాకెట్ చేసి వచ్చి సభలో ప్రకటన చేస్తారా అని జగన్ ప్రశ్నించారు. కాల్‌మనీలో నిందితులైన ఎమ్మెల్యే ఇదే సభలో ఉన్నా ఇప్పటికీ అరెస్ట్ చేయకపోవడాన్ని ఏమనుకోవాలన్నారు. జగన్ ఇంకా మాట్లాడుతుండగానే స్పీకర్ మైక్ కట్ చేశారు. దీంతో వైసీపీ సభ్యులు తిరిగి నినాదాలు చేశారు. స్పీకర్ సభను కాసేపు వాయిదా వేశారు.click to read: బజారు రౌడీలు- వైసీపీ సభ్యులకు చంద్రబాబు వార్నింగ్