Telugu Global
Others

డాక్టరేట్‌ వెనుక కొత్తకోణాలు

చంద్రబాబుకు అమెరికా యూనివర్శిటీ డాక్టరేట్ ప్రదానం చేయడం వెనుక కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. అమెరికాలో ఒక సాధారణ యూనివర్శిటీ డాక్టరేట్ ఇస్తుండగా… టీడీపీ, దాని అనుకూల మీడియా మాత్రం ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన షికాగో యూనివర్శిటీ డాక్టరేట్ ప్రదానం చేస్తున్నట్టు కథనాలు ప్రచురించాయి. అసలు సంగతి ఏమిటంటే… అమెరికాలో యూనివర్శిటీ ఆఫ్ షికాగో, షికాగో స్టేట్ యూనివర్శిటీ అని రెండు ఉన్నాయి. నిజానికి చంద్రబాబుకు డాక్టరేట్ ఇస్తున్నది యూనివర్శిటీ ఆఫ్ షికాగో కాదు. షికాగో స్టేట్ యూనివర్శిటీ […]

డాక్టరేట్‌ వెనుక కొత్తకోణాలు
X

చంద్రబాబుకు అమెరికా యూనివర్శిటీ డాక్టరేట్ ప్రదానం చేయడం వెనుక కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. అమెరికాలో ఒక సాధారణ యూనివర్శిటీ డాక్టరేట్ ఇస్తుండగా… టీడీపీ, దాని అనుకూల మీడియా మాత్రం ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన షికాగో యూనివర్శిటీ డాక్టరేట్ ప్రదానం చేస్తున్నట్టు కథనాలు ప్రచురించాయి. అసలు సంగతి ఏమిటంటే… అమెరికాలో యూనివర్శిటీ ఆఫ్ షికాగో, షికాగో స్టేట్ యూనివర్శిటీ అని రెండు ఉన్నాయి. నిజానికి చంద్రబాబుకు డాక్టరేట్ ఇస్తున్నది యూనివర్శిటీ ఆఫ్ షికాగో కాదు. షికాగో స్టేట్ యూనివర్శిటీ డాక్టరేట్ ఇస్తోంది. యూనివర్శిటీ ఆఫ్ షికాగో అమెరికాలోని యూనివర్శిటీల్లో టాప్ టెన్‌లో ఉంటుంది. షికాగో స్టేట్ యూనివర్శిటీ మాత్రం అమెరికాలోనే అత్యంత తక్కువ ర్యాంక్ ఉన్న యూనివర్శిటీ. మరో కీలక అంశం ఏమిటంటే చంద్రబాబుకు డాక్టరేట్ ఇస్తున్న షికాగో స్టేట్ యూనివర్శిటీలో తెలుగువాడైన దేవీశ్రీ వి. పొట్లూరి కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కొన్ని నెలల క్రితమే ఏపీ మంత్రి మాణిక్యాల రావు కూడా ఈ యూనివర్శిటీని సందర్శించారు. ఆ సమయంలో అక్కడి ప్రొఫెసర్ రవి అచంట మంత్రితో పాటు దగ్గరుండి కో ఆర్డినేట్ చేశారు.

First Published:  18 Dec 2015 5:01 AM GMT
Next Story