బజారు రౌడీలు- వైసీపీ సభ్యులకు చంద్రబాబు వార్నింగ్

అసెంబ్లీలో కాల్‌మనీపై తాను ప్రకటన చేస్తుండగా అడ్డుపడిన వైసీపీ సభ్యులపై సీఎం చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సీఎం ఆగ్రహం కాసేపు కట్టలు తెంచుకుంది. బజారు రౌడీల్లా తయారయ్యారంటూ వైసీపీ సభ్యులపై మండిపడ్డారు. తన స్థానం వద్దకే వచ్చి వైసీపీ సభ్యులు నినాదం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఏమన్నారంటే…”  సభలో ముఖ్యమంత్రికే రక్షణ లేకపోతే ఎలా ?. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచా… ముఖ్యమంత్రిగా చేశాను. రెండుసార్లు ప్రతిపక్ష నేతగా చేశా. నాదగ్గరకే వచ్చి గొడవ చేస్తారా ఏమనుకుంటున్నారు?.బజారు రౌడీల్లా తయారయ్యారు. ఏం అనుకుంటున్నారు తమాషా చేస్తున్నారా?. ఆ మహిళ ఎమ్మెల్యే మాట్లాడేది ఏంటి అధ్యక్ష!. నా జీవితంలో ఇంత దారుణమైన రాజకీయం చూడలేదు అధ్యక్ష. ముఖ్యమంత్రిపైనే దౌర్జన్యం చేస్తారా?. మీరు డౌన్‌ డౌన్ అన్నంత మాత్రనా నేను డౌన్‌ అవను. జాగ్రత్తా?… అంటూ చంద్రబాబు హెచ్చరించారు. అయినా వైపీసీ సభ్యులు మాత్రం కాల్ మనీ చంద్రబాబు అంటూ నినాదాలు చేస్తూనే ఉండిపోయారు.  click to read:సిగ్గుండాలి… ముద్దాయి ముఖ్యమంత్రే ప్రకటన చేయడానికి!