Telugu Global
Cinema & Entertainment

మొత్తానికి మెగాఫోన్ పట్టాడు

కోనవెంకట్ తో కలిసి ఎన్నో హిట్ సినిమాలకు మాటలు, సన్నివేశాలు అందించిన రచయిత గోపీ మోహన్. ఈ స్టార్ రైటర్… దర్శకుడిగా మారతాడని ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతోంది. ఫైనల్ గా ఆ ముహూర్తం కుదిరింది. గోపీమోహన్ మెగాఫోన్ పట్టుకునే టైం దగ్గరపడింది. ఓ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ సిద్ధం చేసుకున్నాడు గోపీమోహన్. మార్చి నుంచి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు. జీవీ రమణారావు నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించి కథ, డైలాగులు, స్క్రీన్ ప్లే మొత్తం పూర్తయ్యాయి. […]

మొత్తానికి మెగాఫోన్ పట్టాడు
X

కోనవెంకట్ తో కలిసి ఎన్నో హిట్ సినిమాలకు మాటలు, సన్నివేశాలు అందించిన రచయిత గోపీ మోహన్. ఈ స్టార్ రైటర్… దర్శకుడిగా మారతాడని ఎప్పట్నుంచో ప్రచారం జరుగుతోంది. ఫైనల్ గా ఆ ముహూర్తం కుదిరింది. గోపీమోహన్ మెగాఫోన్ పట్టుకునే టైం దగ్గరపడింది. ఓ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ సిద్ధం చేసుకున్నాడు గోపీమోహన్. మార్చి నుంచి సెట్స్ పైకి వెళ్లబోతున్నాడు. జీవీ రమణారావు నిర్మించనున్న ఈ సినిమాకు సంబంధించి కథ, డైలాగులు, స్క్రీన్ ప్లే మొత్తం పూర్తయ్యాయి. కానీ హీరోను మాత్రం ఇంకా డిసైడ్ చేయలేదు. దర్శకుడిగా మారతాడనుకునే టైమ్ లో మొదట సునీల్ తో సినిమా చేద్దామనుకున్నాడు గోపీమోహన్. సునీల్ కూడా ఓకే చెప్పేశాడు. కానీ ఆ తర్వాత గోపీ మోహన్ డల్ అవ్వడం…. సునీల్ కు వరుసగా ఫ్లాపులు రావడంతో… ఆ కాంబినేషన్ వర్కవుట్ కాలేదు. ఫైనల్ గా ఓ యంగ్ హీరోతో… యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కించాలని ఫిక్స్ అయ్యాడు గోపీమోహన్. ఆ హీరో ఎవరు… అతడి పక్కన హీరోయిన్ ఎవరనే విషయాల్ని తనే స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటిస్తానంటున్నాడు.

First Published:  17 Dec 2015 7:04 PM GMT
Next Story