Telugu Global
POLITICAL ROUNDUP

కృషికి కొల‌మానం...ఈ లెక్క‌ల టీచ‌రు

ఇటీవ‌ల న‌రేంద్ర మోడీ లండ‌న్ వెళ్లిన‌ప్పుడు 60వేల మంది హాజ‌రైన వెంబ్లీ స్టేడియంలో ప్ర‌సంగిస్తూ, నా దేశంలో ఇమ్రాన్ ఖాన్ వంటి పౌరులున్నార‌ని చెప్పారు. ఒక దేశ ప్ర‌ధాని అలా ఒక వ్య‌క్తిని గురించి అంత పెద్ద వేదిక‌మీద చెప్ప‌డం చాలామందిలో ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది. ఇంత‌కీ ఎవ‌రీ ఇమ్రాన్ ఖాన్…మోడీ ఎందుకు ఆయ‌న గురించి ప్ర‌స్తావించారు. 34 సంవ‌త్స‌రాల ఇమ్రాన్ ఖాన్ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ప‌నిచేస్తున్న ఒక లెక్క‌ల టీచ‌రు. ఆ స్కూలు రాజ‌స్థాన్‌లోని అల్వ‌ర్ జిల్లాలో […]

కృషికి కొల‌మానం...ఈ లెక్క‌ల టీచ‌రు
X

ఇటీవ‌ల న‌రేంద్ర మోడీ లండ‌న్ వెళ్లిన‌ప్పుడు 60వేల మంది హాజ‌రైన వెంబ్లీ స్టేడియంలో ప్ర‌సంగిస్తూ, నా దేశంలో ఇమ్రాన్ ఖాన్ వంటి పౌరులున్నార‌ని చెప్పారు. ఒక దేశ ప్ర‌ధాని అలా ఒక వ్య‌క్తిని గురించి అంత పెద్ద వేదిక‌మీద చెప్ప‌డం చాలామందిలో ఆశ్చ‌ర్యాన్ని క‌లిగించింది. ఇంత‌కీ ఎవ‌రీ ఇమ్రాన్ ఖాన్…మోడీ ఎందుకు ఆయ‌న గురించి ప్ర‌స్తావించారు.

  • 34 సంవ‌త్స‌రాల ఇమ్రాన్ ఖాన్ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ప‌నిచేస్తున్న ఒక లెక్క‌ల టీచ‌రు. ఆ స్కూలు రాజ‌స్థాన్‌లోని అల్వ‌ర్ జిల్లాలో ఉంది.
  • కంప్యూట‌ర్ సైన్స్‌లో బి టెక్ చేసిన త‌న సోద‌రుడు చ‌దివి వ‌దిలేసిన పుస్త‌కాల స‌హాయంతో, వాటిని చ‌దువుకుంటూ, గూగుల్లో ప్రోగ్రామింగ్ గురించి తెలుసుకుంటూ, ఎక్క‌డా శిక్ష‌ణ తీసుకోకుండానే సొంతంగా వెబ్ డెవ‌ల‌ప‌ర్‌గా ఎదిగాడు.
  • అలా పెంచుకున్న‌ నాలెడ్జితో త‌న‌కు తానుగా వంద వెబ్‌సైట్ల‌ను క్రియేట్ చేశాడు. ఇందులో జ‌న‌ర‌ల్ నాలెడ్జికి సంబంధించిన జికెటాక్స్‌.కామ్ కూడా ఒక‌టి.
  • అల్వ‌ర్ జిల్లా క‌లెక్ట‌రుకి ఇమ్రాన్ గురించి తెలిసింది. ఆయ‌న ఇమ్రాన్‌ని, యాప్స్‌ని క్రియేట్ చేయ‌మ‌ని ప్రొత్స‌హించాడు. అత‌నికి త‌న స్మార్ట్‌ఫోన్లోని యాప్స్‌ని చూపిస్తూ వాటి గురించి చెప్పాడు క‌లెక్ట‌ర్‌.
  • దాంతో ఇమ్రాన్, యాప్ రూప‌క‌ల్ప‌న‌ మొదలుపెట్టాడు. నేష‌న‌ల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేష‌న‌ల్ రీసెర్చి అండ్ ట్రైనింగ్ సంస్థ‌ కోసం తొమ్మిద‌వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు ప‌నికొచ్చేలా ఒక సైన్స్ యాప్‌ని క్రియేట్ చేశాడు. ఇది 2012లో జ‌రిగింది. ఇప్ప‌టివ‌ర‌కు ఆయ‌న విద్యార్థుల‌కు ఉప‌యోగ‌ప‌డేలా 50 యాప్‌ల‌ను రూపొందించాడు.
  • వీటిని ఉచితంగా పిల్ల‌లంద‌రికీ అందుబాటులో ఉండేలా చేశాడు. ఇమ్రాన్ యాప్స్‌లో ఒక‌టైన జ‌న‌ర‌ల్ సైన్స్ ఇప్ప‌టివ‌ర‌కు ఐదుల‌క్ష‌ల డౌన్‌లోడ్‌లు చేయ‌బ‌డింది. ఈ యాప్‌లో అనేక సైన్స్ ప్ర‌శ్న‌ల‌కు హిందీలో స‌మాధానాలు ఉన్నాయి.
  • ఇమ్రాన్ ఖాన్ ఇంకా హిస్ట‌రీ, జ‌న‌రల్ నాలెడ్జి, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, ఇంగ్లీషు త‌దిత‌ర స‌బ్జ‌క్టుల్లో యాప్‌ల‌ను క్రియేట్ చేశాడు.

తెలివితేట‌లు, విజ్ఞానం, స్వ‌యం కృషి, ప‌ట్టుద‌ల‌, వృత్తిప‌ట్ల నిబ‌ద్ద‌త‌, పిల్ల‌ల‌కు మేలుచేయాల‌నే తప‌న‌, మంచితనం….ఈ ల‌క్ష‌ణాల‌న్నింటినీ మ‌నం ఈ ఔత్సాహిక ఉపాధ్యాయుడిలో చూడ‌వ‌చ్చు. ఆయ‌న కృషి మ‌రింత‌మందికి స్ఫూర్తినివ్వాల‌ని ఆశిద్దాం.

First Published:  18 Dec 2015 2:16 AM GMT
Next Story