Telugu Global
NEWS

రోజా సస్పెన్షన్‌- రూల్‌ ఏమంటోంది? కరణంను ఎలా చేశారు?

వైసీపీ ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సస్పెండ్‌ చేసి అసెంబ్లీ నుంచి బయటకు పంపడం చర్చనీయాంశమైంది. అసలు ఎలాంటి విచారణ చేయకుండానే కేవలం ఒక ప్రతిపాదన ఆధారంగా ఏడాది పాటు సస్పెండ్ చేయడానికి రూల్స్ ఒప్పుకుంటాయా?. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా అన్న దానిపై చర్చ జరుగుతోంది. సభ నుంచి ఒక సభ్యుడిని రూల్‌ బుక్‌లోని రూల్ నెంబర్ 366, 340 ఆధారంగా సస్పెండ్ చేయడానికి స్పీకర్‌కు అధికారం ఉంది. అయితే ఈ రూల్స్‌ను ఎప్పుడు ఎలా వాడాలి అన్న […]

రోజా సస్పెన్షన్‌- రూల్‌ ఏమంటోంది? కరణంను ఎలా చేశారు?
X

వైసీపీ ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సస్పెండ్‌ చేసి అసెంబ్లీ నుంచి బయటకు పంపడం చర్చనీయాంశమైంది. అసలు ఎలాంటి విచారణ చేయకుండానే కేవలం ఒక ప్రతిపాదన ఆధారంగా ఏడాది పాటు సస్పెండ్ చేయడానికి రూల్స్ ఒప్పుకుంటాయా?. గతంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా అన్న దానిపై చర్చ జరుగుతోంది.

సభ నుంచి ఒక సభ్యుడిని రూల్‌ బుక్‌లోని రూల్ నెంబర్ 366, 340 ఆధారంగా సస్పెండ్ చేయడానికి స్పీకర్‌కు అధికారం ఉంది. అయితే ఈ రూల్స్‌ను ఎప్పుడు ఎలా వాడాలి అన్న దానిపై వివరణ ఉంది. సభలో ఒక సభ్యుడు మరొక సభ్యుడిని గాయపరిచిన సమయంలో సభ నుంచి సస్పెండ్ చేయడానికి రూల్‌ 366 అనుమతిస్తుంది. ఇక స్పీకర్‌ను దూషించడం, చైర్‌ను సవాల్ చేయడం వంటి పనులు చేస్తే రూల్ నెంబర్‌ 340ను వాడవచ్చు. అయితే ఈ రూల్‌ కింద సభ్యుడిని కేవలం నడుస్తున్న సమావేశాల మిగిలిన కాలానికి మాత్రమే సస్పెండ్ చేసే అధికారం ఉంటుంది. అంతకు మించే చేయడానికి వీలులేదు.

కరణం బలరాం విషయంలో ఏం జరిగింది?

గత కాంగ్రెస్ హయాంలో స్పీకర్‌ సరేష్‌ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను టీడీపీ సభ్యుడు కరణం బలరాంను ఆరు నెలల పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు. అయితే వెంటనే సభలోనే ఆయనపై చర్యలు తీసుకోలేదు. విషయాన్ని సభా హక్కుల కమిటీ ముందుంచారు. సీనియర్ సభ్యుడు గాదె వెంకట్‌రెడ్డి నేతృత్వంలో సభా హక్కుల కమిటీ అన్ని సాక్ష్యాలను పరిశీలించింది. కరణం బలరాం కూడా విచారణకు హాజరై వాదనలు వినిపించారు. ఆ తర్వాత సభా హక్కుల కమిటీ సిఫార్సు మేరకు కరణం బలరాంపై సస్పెన్షన్‌ వేటు వేశారు. ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు … బలరాంపై సస్పెన్షన్‌ వేటుకు నిరసనగా మిగిలిన విపక్షాలతో కలిసి అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ధర్నా చేశారు.

సభలో నిర్ణయాలు తీసుకునే పూర్తి అధికారం స్పీకర్‌కు ఉంటుందని… ఆ అధికారంతోనే రోజాపై సస్పెన్షన్‌ వేటు వేసి ఉండవచ్చని భావిస్తున్నారు. స్పీకర్‌ నిర్ణయాలను ప్రశ్నించడం వీలుకాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

First Published:  18 Dec 2015 10:46 AM GMT
Next Story