Telugu Global
POLITICAL ROUNDUP

ప‌ది దాటితే అది అక్కడ నేర‌మే!

ఒక దేశంలో పాటించే ప‌ద్ధ‌తులు, చ‌ట్టాలు, ఒక్కోసారి మ‌రొక‌దేశంలో ఉన్న‌వారికి వింత‌లు విశేషాలుగా క‌న‌బ‌డ‌తాయి. అలా ఇత‌ర దేశాల్లో చ‌ట్టాలుగా ఉండి, మ‌న‌కు హాస్యాస్ప‌దంగా అనిపించే కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు- గ్రీసుదేశంలో పెళ్లి చేసుకుంటే వెడ్డింగ్ నోటీసుని త‌ప్ప‌నిస‌రిగా గ్రీకు న్యూస్ పేప‌ర్లో ప్ర‌క‌టించాలి. లేదా సిటీహాలులో ఉన్న నోటిసు బోర్డులో అయినా ఉంచాలి. అంటే అక్క‌డ పెళ్లి చేసుకుంటే పేప‌రులో ప్ర‌క‌ట‌న కోసం అద‌న‌పు ఖ‌ర్చుని భ‌రించాల్సిందేన‌న్న‌మాట‌. ఇది మ‌రీ విచిత్రం…రాత్రి ప‌ది దాటితే స్విట్జ‌ర్లాండ్‌లో […]

ప‌ది దాటితే అది అక్కడ నేర‌మే!
X

ఒక దేశంలో పాటించే ప‌ద్ధ‌తులు, చ‌ట్టాలు, ఒక్కోసారి మ‌రొక‌దేశంలో ఉన్న‌వారికి వింత‌లు విశేషాలుగా క‌న‌బ‌డ‌తాయి. అలా ఇత‌ర దేశాల్లో చ‌ట్టాలుగా ఉండి, మ‌న‌కు హాస్యాస్ప‌దంగా అనిపించే కొన్ని ఆస‌క్తిక‌ర‌మైన అంశాలు-

  • గ్రీసుదేశంలో పెళ్లి చేసుకుంటే వెడ్డింగ్ నోటీసుని త‌ప్ప‌నిస‌రిగా గ్రీకు న్యూస్ పేప‌ర్లో ప్ర‌క‌టించాలి. లేదా సిటీహాలులో ఉన్న నోటిసు బోర్డులో అయినా ఉంచాలి. అంటే అక్క‌డ పెళ్లి చేసుకుంటే పేప‌రులో ప్ర‌క‌ట‌న కోసం అద‌న‌పు ఖ‌ర్చుని భ‌రించాల్సిందేన‌న్న‌మాట‌.
  • ఇది మ‌రీ విచిత్రం…రాత్రి ప‌ది దాటితే స్విట్జ‌ర్లాండ్‌లో టాయ్‌లెట్‌కి వెళ్ల‌డం చ‌ట్ట‌విరుద్ధం. పొరుగువారిని ప్రేమించు…అనే ప్ర‌చారం పీక్స్‌కి వెళ్లిన ఫ‌లితం ఇది. టాయ్‌లెట్ నీళ్ల చ‌ప్పుడు సైతం ప‌క్క‌నున్న‌వారికి ఇబ్బంది క‌ల‌గ‌కూడ‌ద‌ని ఈ చ‌ట్టం ప్ర‌వేశ‌పెట్టారు. అంటే అక్క‌డికి వెళితే రాత్రి భోజ‌నంలో పొట్ట‌ని ఏమాత్రం ఇబ్బంది పెట్ట‌ని ఆహారాన్నే తీసుకోవాల‌న్న‌మాట‌.
  • స్పెయిన్‌లో డ్రైవింగ్ చేసేట‌ప్పుడు బూట్లు త‌ప్ప‌నిస‌రి. మ‌న‌కు అనుకూలంగా ఉన్నాయి క‌దా అని ఏ హావాయి చెప్పులో, శాండ‌ల్సో వేసుకుని డ్రైవింగ్ చేయ‌డం అక్క‌డ చ‌ట్ట విరుద్ధం. అలా చేస్తే ట్రాఫిక్ చ‌ట్టాల ప్రకారం 150 యూరోలు చెల్లించాల్సి ఉంటుంది.
  • బొలీవియాలో పెళ్ల‌యిన మ‌హిళ‌లు వైన్ తాగాల‌నుకుంటే వారికి ఒక్క పెగ్గుకి మాత్ర‌మే అనుమ‌తి ఉంది. రెండో పెగ్గు తాగితే చ‌ట్టాన్ని ఎదిరించిన‌ట్టే.
  • డెన్మార్క్‌లో ఒక మంచి చ‌ట్టం ఉంది. వారు ఆహారం విష‌యంలో చాలా ప‌ద్ధ‌తిగా ఉంటారు. ఒక‌వేళ ఎవ‌రికైనా హోట‌ల్‌లో త‌మ‌కు వ‌డ్డించిన ఆహారం స‌రిపోలేదు అనిపిస్తే తిన్న‌దానికి బిల్లు క‌ట్ట‌కుండానే వెళ్లిపోవ‌చ్చు. అంటే అంత‌గా, పూర్తిగా స‌రిపోయేంత ఆహారాన్ని స‌ర్వ్ చేస్తార‌న్న‌మాట‌.
  • ఇట‌లీలో ప్ర‌జ‌లు త‌మ భావోద్వేగాలను చాలా స్వేచ్ఛ‌గా ప్ర‌ద‌ర్శిస్తారు. అంటే అరుపులు, కేక‌లు లాంటివి అక్క‌డ కామ‌న్‌గా క‌న‌బ‌డుతుంటాయి. కానీ ఇట‌లీలోని పెద్ద న‌గ‌రాల్లో ఒక‌టైన మిలాన్‌లో మాత్రం కోపాన్ని ప్ర‌ద‌ర్శించ‌డం చ‌ట్ట‌వ్య‌తిరేకం. కోపాన్ని ప్ర‌క‌టిస్తే ఫైనేన‌న్న‌మాట‌. కోపం అదుపుకి ఇప్ప‌టివ‌ర‌కు మ‌నం చాలా మార్గాలు విని ఉన్నాం. వాటిలో ఇది మ‌రింత భిన్నంగా ఉంది.
  • ఇంగ్లండులో ఒక విచిత్ర‌మైన చ‌ట్టం ఉంది. అక్క‌డ బ్రిటీష్ పార్ల‌మెంటు హౌస్‌కి స‌మీపంలో మ‌ర‌ణించ‌డం చ‌ట్ట‌విరుద్ధం, నేరం. ఒక‌వేళ అలా ఎవ‌రైనా చ‌నిపోతే జీవితంలో ఆ మ‌నిషి చేసిన చిట్ట‌చివ‌రి నేరం అవుతుంద‌న్న‌మాట‌. కానీ ఈ నేరానికి శిక్ష ఎలా వేస్తారో మ‌రి.
First Published:  18 Dec 2015 2:05 AM GMT
Next Story