Telugu Global
Others

ఈయన సైకిల్ ఎక్కడం ఖాయమా?

ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్మన్‌ ఈదర హరిబాబుపై టీడీపీ కన్నేసినట్టు తెలుస్తోంది. ఆయనను తిరిగి పార్టీలోకి తెచ్చేందుకు టీడీపీ అధిష్టానం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే ఇక్కడ అధినాయకత్వానికి మరో చిక్కు వచ్చి పడింది. ఈదర ఎన్నిక చెల్లదంటూ ప్రభుత్వం అనర్హత వేటు వేయగా ఆయన కోర్టును ఆశ్రయించారు. ఏకంగా సుప్రీం వరకు వెళ్లారు. ఈ కేసులో వెంటనే తీర్పు చెప్పాలని సుప్రీం కోర్టు ఆదేశించడంతో  ఇటీవల ఈదరకు అనుకూలంగా జిల్లా కోర్టు తీర్పు చెప్పింది. దీంతో రెండు […]

ఈయన సైకిల్ ఎక్కడం ఖాయమా?
X

ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్మన్‌ ఈదర హరిబాబుపై టీడీపీ కన్నేసినట్టు తెలుస్తోంది. ఆయనను తిరిగి పార్టీలోకి తెచ్చేందుకు టీడీపీ అధిష్టానం ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే ఇక్కడ అధినాయకత్వానికి మరో చిక్కు వచ్చి పడింది. ఈదర ఎన్నిక చెల్లదంటూ ప్రభుత్వం అనర్హత వేటు వేయగా ఆయన కోర్టును ఆశ్రయించారు. ఏకంగా సుప్రీం వరకు వెళ్లారు. ఈ కేసులో వెంటనే తీర్పు చెప్పాలని సుప్రీం కోర్టు ఆదేశించడంతో ఇటీవల ఈదరకు అనుకూలంగా జిల్లా కోర్టు తీర్పు చెప్పింది. దీంతో రెండు నెలల క్రితం ఆయన జెడ్పీ చైర్మన్ పదవిని తిరిగి చేపట్టారు. అయితే జిల్లా కోర్టు తీర్పును హైకోర్టులో సవాల్ చేయాలని జిల్లా టీడీపీ అధ్యక్షుడు, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ప్రయత్నిస్తున్నారట. అది కూడా ప్రభుత్వం తరపునే అప్పీల్‌కు వెళ్లేలా చేసేందుకు యత్నిస్తున్నారు. ఈ విషయంలో దామచర్ల చాలా పట్టుదలతో ఉన్నారట.

అయితే ఈదర హరిబాబు కూడా పాత పరిచయాలతో మంత్రులు, టీడీపీ ముఖ్యనేతలతో దగ్గరగా మెలుగుతున్నారని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈదరను తిరిగి పార్టీలోకి తీసుకునేందుకు జిల్లా నేతలను ఒప్పించేందుకు టీడీపీ అధినాయకత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ బాధ్యతను కేంద్రమంత్రి సుజనా చౌదరికి అప్పగించారని తెలుస్తోంది. త్వరలోనే ఆయన జిల్లాకు వస్తారని ఆ సమయంలోనే ఈదర హరిబాబు చేరికపై పార్టీ నేతలను ఒప్పిస్తారని అంటున్నారు. ఈదర హరిబాబుకు వ్యతిరేకంగా కోర్టుకు వెళ్తే తుది తీర్పు వచ్చేలోపు ఆయన పదవీకాలమే ముగిసిపోతుందని చెబుతున్నారు. అదే హరిబాబును పార్టీలోకి చేర్చుకుంటే జెడ్పీ చైర్మన్ టీడీపీ అధీనంలోనే ఉంటుందన్న కోణంలో పార్టీ నేతలను ఒప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు. మరో నెల రోజుల్లో జెడ్పీ చైర్మన్ హరిబాబు సంగతి తేలుతుందని టీడీపీ నేతలు చెబుతున్నారు.

First Published:  19 Dec 2015 1:29 AM GMT
Next Story