Telugu Global
NEWS

అధికార పార్టీకి జగన్‌ భవిష్యత్తు హెచ్చరిక

ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయడంపై అసెంబ్లీ దద్దరిల్లింది. రోజాను అసెంబ్లీ గేటు వద్దే ఆపడంపై జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రూల్స్‌లో లేని, మీకు లేని అధికారులను ఎలా ఉపయోగిస్తారని జగన్‌ ప్రశ్నించారు. ఏడాది పాటు సస్పెన్షన్‌ వేటు ఏ అధికారంతో వేశారో చెప్పాలని నిలదీశారు. ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు.. రేపు మేం అధికారంలోకి వస్తాం. అప్పుడు పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు. రోజాపై సస్పెన్షన్‌ ఎత్తివేసే వరకూ సభను జరగనిచ్చే […]

అధికార పార్టీకి జగన్‌ భవిష్యత్తు హెచ్చరిక
X

ఎమ్మెల్యే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేయడంపై అసెంబ్లీ దద్దరిల్లింది. రోజాను అసెంబ్లీ గేటు వద్దే ఆపడంపై జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రూల్స్‌లో లేని, మీకు లేని అధికారులను ఎలా ఉపయోగిస్తారని జగన్‌ ప్రశ్నించారు. ఏడాది పాటు సస్పెన్షన్‌ వేటు ఏ అధికారంతో వేశారో చెప్పాలని నిలదీశారు. ఈ రోజు మీరు అధికారంలో ఉన్నారు.. రేపు మేం అధికారంలోకి వస్తాం. అప్పుడు పరిస్థితి ఏమిటి అని ప్రశ్నించారు. రోజాపై సస్పెన్షన్‌ ఎత్తివేసే వరకూ సభను జరగనిచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

ఈ సమయంలో జోక్యం చేసుకున్న బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సభను అడ్డుకుంటామని చెప్పడం సరికాదన్నారు. అయితే బీజేపీ ఎమ్మెల్యేల తీరునూ జగన్ తప్పుపట్టారు. సగం టీడీపీ కండువా వేసుకుని ఎందుకు మాట్లాడుతారని బీజేపీ సభ్యులను జగన్‌ ప్రశ్నించారు. జనం గొంతు వినే ఓపిక లేనప్పుడు ఇక అసెంబ్లీ ఎందుకని ప్రశ్నించారు. అధికార పార్టీ చెప్పిందే స్పీకర్ చేస్తున్నారని జగన్ ఆరోపించారు. రోజాపై సస్పెన్షన్‌ ఎత్తివేయాల్సిందేనని డిమాండ్ చేశారు. అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇంతలోనే స్పీకర్ మైక్ కట్ చేశారు. దీంతో వైసీపీ సభ్యులు పోడియం ముందు వద్దకు వెళ్లి నినాదాలు చేశారు.

click to read: రోజా అరెస్ట్, నాంపల్లి పీఎస్‌కు జగన్

ఏ నిర్ణయమైనా తీసుకునే హక్కు సభకు ఉంటుందని యనమల రామకృష్ణుడు చెప్పారు. సభ నిర్ణయాన్ని ప్రశ్నించే అధికారం హైకోర్టు, సుప్రీం కోర్టుకు కూడా ఉండదని చెప్పారు. సభ నిర్ణయమే ఫైనల్ అని తేల్చిచెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రోజాపై సస్పెన్షన్‌ వేటు ఎత్తివేసే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. ప్రభుత్వ తీరుపై విపక్ష సభ్యులు ఆందోళనకు దిగారు. విపక్షం ఆందోళన చేస్తుండగానే అధికార పార్టీకి చెందిన యనమల, కాల్వ శ్రీనివాస్‌, అచ్చెన్నాయుడు తదితరులకు వరుసగా మాట్లాడేందుకు మైక్ అవకాశం ఇచ్చారు. వారంతా జగన్‌ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సభ అదుపులోకి రాకపోవడంతో సభను స్పీకర్‌ 10 నిమిషాల పాటు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తర్వాత గందరగోళం మధ్యే మంత్రులు పలు బిల్లులను ప్రవేశపెట్టారు. అనంతరం సభను స్పీకర్ సోమవారానికి వాయిదా వేశారు.

First Published:  18 Dec 2015 11:07 PM GMT
Next Story