జగన్‌ మా వాడే… చెబుదామని వచ్చా!

టీడీపీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డి కాల్‌మనీ, జగన్‌ తీరుపై స్పందించారు.  కాల్‌మనీపై అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో ఆయన లాబీల్లో కనిపించారు. సార్‌ ఎందుకు వచ్చారు అని మీడియా ప్రతినిధులు ఆరా తీయగా జగన్‌ కోసం వచ్చానని చెప్పారు. ” జగన్‌ మావాడే .. అసెంబ్లీలో ఆయన తీరు బాగోలేదు. ఎలా వ్యవహరించాలో హితబోధ చేయడానికి వచ్చా.. చంద్రబాబు సంగతులు చెప్పకుండా అరుచుకుంటే ఏం ఉపయోగం” అని వ్యాఖ్యానించారు. వడ్డీ వ్యాపారం రాష్ట్ర వ్యాప్తంగా ఎప్పటి నుంచో జరుగుతుందోని … అయితే విజయవాడలో మాత్రం చాలా ఎగస్ట్రాలు చేశారని జేసీ అన్నారు. ఇంతలో టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అటుగా వచ్చి జగన్‌ గురించి జేసీ వద్ద కామెంట్ చేయబోయారు. ఇందుకు స్పందించిన దివాకర్‌ రెడ్డి ”ప్రతిపక్షనాయకుడిని అవమానిస్తున్నావ్… వద్దు” అంటూ అడ్డుతగిలారు.