Telugu Global
Others

మ‌హిళ‌ల ర‌క్ష‌ణ కోసం స్త్రీ స‌మ్మాన్ యాప్‌

లూథియానా పోలీసులు మ‌హిళ‌ల ర‌క్ష‌ణ కోసం మ‌రో ముంద‌డుగు వేశారు. స్త్రీ స‌మ్మాన్ పేరుతో ఒక మొబైల్ అప్లికేష‌న్‌ని ప్రారంభించారు. ఈ మొబైల్  యాప్ ద్వారా ఆప‌ద‌లో ఉన్న మ‌హిళ‌లు పోలీస్ కంట్రోల్ రూముకి, మ‌రో ఐదు ఫోన్ నెంబ‌ర్ల‌కు త‌మ స‌మాచారాన్ని అంద‌జేయ‌వ‌చ్చు. స్టేష‌న్ హౌస్ ఆఫీస‌ర్‌ సైతం మ‌హిళ‌ల మేసేజ్‌ల‌ను అందుకుంటారు. ఆప‌ద‌లో ఉన్న మ‌హిళ‌ల‌ను ఆదుకోవ‌డ‌మే కాకుండా, మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిన ప్రాంతాల్లో మ‌రింత పెట్రోలింగ్‌ని పెంచేందుకు కూడా ఈ యాప్ వ‌ల‌న […]

మ‌హిళ‌ల ర‌క్ష‌ణ కోసం స్త్రీ స‌మ్మాన్ యాప్‌
X

లూథియానా పోలీసులు మ‌హిళ‌ల ర‌క్ష‌ణ కోసం మ‌రో ముంద‌డుగు వేశారు. స్త్రీ స‌మ్మాన్ పేరుతో ఒక మొబైల్ అప్లికేష‌న్‌ని ప్రారంభించారు. ఈ మొబైల్ యాప్ ద్వారా ఆప‌ద‌లో ఉన్న మ‌హిళ‌లు పోలీస్ కంట్రోల్ రూముకి, మ‌రో ఐదు ఫోన్ నెంబ‌ర్ల‌కు త‌మ స‌మాచారాన్ని అంద‌జేయ‌వ‌చ్చు. స్టేష‌న్ హౌస్ ఆఫీస‌ర్‌ సైతం మ‌హిళ‌ల మేసేజ్‌ల‌ను అందుకుంటారు. ఆప‌ద‌లో ఉన్న మ‌హిళ‌ల‌ను ఆదుకోవ‌డ‌మే కాకుండా, మ‌హిళ‌ల‌కు ర‌క్ష‌ణ క‌ల్పించాల్సిన ప్రాంతాల్లో మ‌రింత పెట్రోలింగ్‌ని పెంచేందుకు కూడా ఈ యాప్ వ‌ల‌న వీల‌వుతుంద‌ని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు మ‌హిళ‌ల స‌మస్య‌ల‌ను నేరుగా ప‌రిష్క‌రించ‌డంలో ఈ యాప్ స‌హ‌క‌రిస్తుంద‌ని లూథియానా పోలీస్ ప్ర‌తినిథి ఒక‌రు తెలిపారు.

సోమ‌వారం నుండి స్కూళ్లు, కాలేజీల్లో స‌మావేశాలు నిర్వ‌హించనున్నామ‌ని, యాప్ గురించి విద్యార్థినుల‌కు వివ‌రించి వారి ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల‌లో దీన్ని డౌన్‌లోడ్ చేసుకునేలా ప్రోత్స‌హిస్తామ‌ని లూథియానా పోలీసులు చెబుతున్నారు.

తొలుత ఆండ్రాయిడ్ ఫోన్ల‌కు మాత్ర‌మే అందుబాటులో ఉన్నా త‌రువాత యాపిల్‌, విండోస్ ఆధారిత ఫోన్ల‌కు సైతం దీన్ని అందుబాటులోకి తెస్తారు. ప్ర‌స్తుతం యాప్ ప‌నితీరుని ప‌రీక్షిస్తున్నారు. ప‌దిరోజుల్లో ఇందులో ఏమైనా లోపాలు, స‌మ‌స్య‌లు ఉంటే వాటిని స‌రిచేసి పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకువ‌స్తారు.

మ‌హిళ‌లు త‌మ నెంబ‌రుని రిజిస్ట‌ర్ చేసుకుంటే తాము ప‌రిశీలించి పాస్‌వ‌ర్డ్ కేటాయిస్తామ‌ని, ముందుగా స‌మ‌స్య‌ల్లో లేదా అపాయంలో ఉన్న మ‌హిళ‌లు త‌మ‌కు మెసేజ్ చేస్తే తిరిగి తాము కాల్ చేసి ఆ అబ్య‌ర్థ‌న నిజ‌మ‌ని రుజువు చేసుకున్నాక త‌మ టీమ్‌ని పంపుతామ‌ని పోలీసులు చెబుతున్నారు. ఆప‌ద‌లో ఉన్న మ‌హిళ‌లు ఫోన్ స్క్రీన్‌మీద క‌న‌బ‌డుతున్న హెల్ప్ బ‌ట‌న్‌ని క్లిక్ చేయాలి. లేదా ఫోన్‌ని విప‌రీతంగా షేక్ చేయ‌డం వ‌ల‌న పోలీసుల‌కు, ఆ మ‌హిళ తాలూకూ మూడు నెంబ‌ర్ల‌కు మెసేజ్ వెళుతుంది. పోలీస్ కంట్రోల్ రూముల‌కు అనుసంధానంగా ప‌నిచేసే 14 బృందాలు ఇర‌వైనాలుగు గంట‌లు అప్ర‌మ‌త్తంగా అందుబాటులో ఉంటాయి.

First Published:  19 Dec 2015 3:20 AM GMT
Next Story