Telugu Global
Cinema & Entertainment

బ్రహ్మోత్సవానికి సీతమ్మ సెంటిమెంట్

ఓ సినిమా హిట్టయిందంటే దానికి సంబంధించిన ఏ చిన్న సెంటిమెంట్ ను వదులుకోవడానికి ఇష్టపడరు మేకర్స్. సినిమా టైటిల్ నుంచి, నటీనటుల వరకు అందర్నీ సెంటిమెంట్ గా ఫీలయిపోతుంటారు. ఇప్పుడు బ్రహ్మోత్సవం విషయంలో కూడా అదే జరుగుతోంది. సెంటిమెంట్ ప్రకారం ఈ సినిమాకు ఇప్పటికే కొంతమంది నటీనటుల్ని తీసేసుకున్నారు. తాజాగా ఈ క్యూలోకి ఇప్పుడు మణిశర్మ కూడా చేరిపోయాడు. అవును…. అప్పట్లో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమాకు మణిశర్మే రీ-రికార్డింగ్ అందించాడు. […]

బ్రహ్మోత్సవానికి సీతమ్మ సెంటిమెంట్
X
ఓ సినిమా హిట్టయిందంటే దానికి సంబంధించిన ఏ చిన్న సెంటిమెంట్ ను వదులుకోవడానికి ఇష్టపడరు మేకర్స్. సినిమా టైటిల్ నుంచి, నటీనటుల వరకు అందర్నీ సెంటిమెంట్ గా ఫీలయిపోతుంటారు. ఇప్పుడు బ్రహ్మోత్సవం విషయంలో కూడా అదే జరుగుతోంది. సెంటిమెంట్ ప్రకారం ఈ సినిమాకు ఇప్పటికే కొంతమంది నటీనటుల్ని తీసేసుకున్నారు. తాజాగా ఈ క్యూలోకి ఇప్పుడు మణిశర్మ కూడా చేరిపోయాడు. అవును…. అప్పట్లో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు సినిమాకు మణిశర్మే రీ-రికార్డింగ్ అందించాడు. అప్పట్లో ఆ సినిమా పెద్ద హిట్. అందుకే ఇప్పుడు తాజాగా మరోసారి మహేష్ తో తీస్తున్న బ్రహ్మోత్సవం సినిమాకు కూడా మణిశర్మనే రీ-రికార్డింగ్ కోసం తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడు డైరక్టర్ శ్రీకాంత్.
బ్రహ్మోత్సవం సినిమాకు సంబంధించి ఇప్పటికే రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాయి. త్వరలోనే ఈ సెట్స్ పైకి సమంత వచ్చి చేరనుంది. ఇన్నాళ్లూ తమిళ సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ… ఇప్పుడు మహేష్ సినిమాలకు కాల్షీట్లు కేటాయించింది. వచ్చే ఏడాది జనవరి నుంచి హైదరాబాద్ లో జరిగే షెడ్యూల్ లో సమంత పాల్గొంటుంది. ప్రస్తుతం బ్రహ్మోత్సం షూటింగ్ ఊటీలో జరుగుతోంది. ఇది కంప్లీట్ అయిన వెంటనే… రామోజీ ఫిలింసిటీలో మరో షెడ్యూల్ ఉంటుంది. ఆ షూటింగ్ లోనే సమంత జాయిన్ అవుతుంది.
First Published:  18 Dec 2015 7:08 PM GMT
Next Story