Telugu Global
Cinema & Entertainment

మొదటి రోజే రజనీకాంత్ సినిమాకు అడ్డంకి

 భారీ అంచనాల మధ్య రోబో-2 సినిమాను ప్రారంభించాడు రజనీకాంత్. చెన్నై శివార్లలో ఏర్పాటుచేసిన ప్రత్యేక సెట్ లో…. సినిమా షూటింగ్ ను లాంఛనంగా ప్రారంభించారు. మూవీకి చిట్టి 2.0 అనే పేరు కూడా పెట్టారు. కానీ తొలిరోజే రజనీకాంత్ సినిమాకు నిరసనల సెగ ఎదురైంది. ఊహించని విధంగా ఓ పెద్ద గుంపు వచ్చి రజనీ సినిమాను అడ్డుకుంది. వాళ్లు సినిమా షూటింగ్ ను అడ్డుకోవడానికి కారణం హీరోయిన్ ఎమీ జాక్సన్. ఆమెను సినిమాలోంచి తీసేయాలనేది వాళ్ల డిమాండ్.  […]

మొదటి రోజే రజనీకాంత్ సినిమాకు అడ్డంకి
X
భారీ అంచనాల మధ్య రోబో-2 సినిమాను ప్రారంభించాడు రజనీకాంత్. చెన్నై శివార్లలో ఏర్పాటుచేసిన ప్రత్యేక సెట్ లో…. సినిమా షూటింగ్ ను లాంఛనంగా ప్రారంభించారు. మూవీకి చిట్టి 2.0 అనే పేరు కూడా పెట్టారు. కానీ తొలిరోజే రజనీకాంత్ సినిమాకు నిరసనల సెగ ఎదురైంది. ఊహించని విధంగా ఓ పెద్ద గుంపు వచ్చి రజనీ సినిమాను అడ్డుకుంది. వాళ్లు సినిమా షూటింగ్ ను అడ్డుకోవడానికి కారణం హీరోయిన్ ఎమీ జాక్సన్. ఆమెను సినిమాలోంచి తీసేయాలనేది వాళ్ల డిమాండ్.
తాజాగా జల్లికట్టుకు సంబంధించి ఎమీ జాక్షన్ కొన్ని వ్యాఖ్యలు చేసింది. తమిళనాట బాగా పాపులర్ అయిన ఈ జల్లికట్టును అక్కడ నిషేధించారు. సంక్రాంతికి ఈ జల్లికట్టు ఉంటనే తమిళ తంబీలకు అసలైన పండగ. అలాంటి సంప్రదాయాన్ని ప్రభుత్వం బ్యాన్ చేయడం… పైగా ఆ నిషేధాన్ని ఎమీ జాక్సన్ సమర్థించడంతో… రజనీ ఫ్యాన్స్ రెచ్చిపోయారు. రోబో-2 సినిమా నుంచి ఎమీని తప్పించాలని డిమాండ్ చేస్తూ షూటింగ్ ను అడ్డుకున్నారు. సమయానికి పోలీసులు వచ్చి పరిస్థితిని అదుపుచేశారు.
First Published:  18 Dec 2015 7:03 PM GMT
Next Story