రోజా అరెస్ట్, నాంపల్లి పీఎస్‌కు జగన్

roja1వైసీపీ ఎమ్మెల్యే రోజాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అసెంబ్లీ ఆవరణలోకి వస్తున్న రోజాను గేటు దగ్గరే పోలీసులు అడ్డుకున్నారు. లోనికి వచ్చేందుకు అనుమతి లేదని అడ్డుకున్నారు. ఈసమయంలో పోలీసులతో రోజా వాగ్వాదానికి దిగారు. దీంతో బలవంతంగా ఆమెను పోలీసులు తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో రోజా కిందపడిపోవడంతో ఆమెకు గాయాలయ్యాయి. అయినా ఆమెను నాంపల్లి పీఎస్‌కు తరలించారు.  

రోజాను నాంపల్లి పీఎస్‌కు వెళ్లి జగన్ పరామర్శించారు. పోలీసుల తీరును జగన్‌ తప్పుపట్టారు. పోలీసులతో జగన్ వాగ్వాదానికి దిగారు. అనారోగ్యంతో ఉన్న మహిళా ఎమ్మెల్యేను ఎలా అరెస్ట్ చేస్తారని ప్రశ్నించారు. పోలీస్ స్టేషన్ వద్ద రోజా సొమ్మసొల్లిపడిపోయారు. దీంతో  ఆమెను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు.

click to read:అధికార పార్టీకి జగన్‌ భవిష్యత్తు హెచ్చరిక