Telugu Global
Cinema & Entertainment

దర్శకులకు చుక్కలు చూపించిన సిసింద్రీ

  నిన్నగాక మొన్నొచ్చాడు. చేసింది ఒకే ఒక్క సినిమా. ఆ ఒక్క సినిమా కూడా యావరేజ్ టాక్ తో ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. అయినప్పటికీ అఖిల్ కు మాత్రం బోలెడంత క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ తోనే ఇప్పుడు దర్శకులకు చుక్కలు చూపిస్తున్నాడని సమాచారం. అఖిల్ రెండో సినిమా కోసం తెరవెనక ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. అఖిల్ ను మెప్పించేందుకు ఇప్పటికే కొన్ని కథలు సిద్ధంచేసుకున్నారు కొంతమంది దర్శకులు. వాళ్లలో శ్రీనువైట్ల, దేవ్ కట్టా, సుధీర్ వర్మ, విజయ్ […]

దర్శకులకు చుక్కలు చూపించిన సిసింద్రీ
X
నిన్నగాక మొన్నొచ్చాడు. చేసింది ఒకే ఒక్క సినిమా. ఆ ఒక్క సినిమా కూడా యావరేజ్ టాక్ తో ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. అయినప్పటికీ అఖిల్ కు మాత్రం బోలెడంత క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ తోనే ఇప్పుడు దర్శకులకు చుక్కలు చూపిస్తున్నాడని సమాచారం. అఖిల్ రెండో సినిమా కోసం తెరవెనక ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.
అఖిల్ ను మెప్పించేందుకు ఇప్పటికే కొన్ని కథలు సిద్ధంచేసుకున్నారు కొంతమంది దర్శకులు. వాళ్లలో శ్రీనువైట్ల, దేవ్ కట్టా, సుధీర్ వర్మ, విజయ్ కుమార్ కొండా లాంటి దర్శకులున్నారు. వీళ్లలో కొందరు ఇప్పటికే అఖిల్ కు స్టోరీలైన్ కూడా వినిపించారు. సిసింద్రీ కూడా ప్రాధమికంగా స్టోరీలైన్ బాగుందని చెప్పి, దాన్ని ఇంకా డెవలప్ చేయమని చెప్పాడట. కట్ చేస్తే…. దర్శకులంతా తమతమ కథల్లో బిజీగా ఉన్న టైమ్ లో ఒక్కసారిగా మాటమార్చాడట సిసింద్రీ.
ఇప్పటివరకు విన్న కథలన్నీ పక్కనపెట్టేసి….తన రెండో సినిమాకు క్యూట్ లవ్ స్టోరీని రాసుకొని రమ్మని పురమాయించాడట. దీంతో సదరు దర్శకులంతా తలపట్టుకున్నారు. ఇన్నాళ్లూ కష్టపడి రాసుకున్న కథలు, స్క్రీన్ ప్లేలు అన్నీ పక్కనపెట్టేసి అఖిల్ కోసం మరో కథ రాసుకోవడమా…. లేక ఇప్పటికే రాసుకున్న కథతో మరో హీరోను ట్రైచేసుకోవడమా…. అనే సందిగ్దంలో పడిపోయారట కొందరు దర్శకులు. లవ్ స్టోరీ చేసే ఉద్దేశం ఉంటే ముందే చెప్పేయాలి కదా అఖిల్…. ఇలా చేస్తే ఎలా….?
First Published:  19 Dec 2015 7:03 PM GMT
Next Story