Telugu Global
Cinema & Entertainment

దేవిశ్రీ సినిమాలకే ఎందుకిలా జరుగుతోంది ?

టాలీవుడ్ లో మరో కలకలం. మరో లీకేజీ వ్యవహారం. మరో వారం రోజుల్లో ఆడియో ఫంక్షన్ ఉందనగా…. నాన్నకు ప్రేమతో సినిమాలోని ఓ పాట నెట్ లో ప్రత్యక్షమైంది. దాదాపు నిమిషం నిడివి ఉన్న ఆడియో ట్రాక్ ను ఎవరో ఇంటర్నెట్ లో పోస్ట్ చేశారు. దీంతో అవాక్కవ్వడం ఇండస్ట్రీ వంతయింది. అత్తారింటికి దారేది సినిమా ఏకంగా ఫస్టాప్ అంతా నెట్ లోకి వచ్చేసింది. మొన్నటికి మొన్న కోట్లు ఖర్చు చేసి తీసిన బాహుబలి సినిమాకు సంబంధించి యుద్ధ సన్నివేశం ఒకటి బయటకొచ్చేసింది. […]

దేవిశ్రీ సినిమాలకే ఎందుకిలా జరుగుతోంది ?
X

టాలీవుడ్ లో మరో కలకలం. మరో లీకేజీ వ్యవహారం. మరో వారం రోజుల్లో ఆడియో ఫంక్షన్ ఉందనగా…. నాన్నకు ప్రేమతో సినిమాలోని ఓ పాట నెట్ లో ప్రత్యక్షమైంది. దాదాపు నిమిషం నిడివి ఉన్న ఆడియో ట్రాక్ ను ఎవరో ఇంటర్నెట్ లో పోస్ట్ చేశారు. దీంతో అవాక్కవ్వడం ఇండస్ట్రీ వంతయింది. అత్తారింటికి దారేది సినిమా ఏకంగా ఫస్టాప్ అంతా నెట్ లోకి వచ్చేసింది. మొన్నటికి మొన్న కోట్లు ఖర్చు చేసి తీసిన బాహుబలి సినిమాకు సంబంధించి యుద్ధ సన్నివేశం ఒకటి బయటకొచ్చేసింది. ఇప్పుడు నాన్నకు ప్రేమతో ఆడియో బిట్ లీకవ్వడం కలకలం రేపుతోంది. అయితే మిగతా సినిమాలన్నీ ఒకెత్తు. నాన్నకు ప్రేమతో మరో ఎత్తు. ఎందుకంటే… ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడు. అతడి సంగీత దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాలకు సంబంధించి ఇలానే ఇంతకుముందు లీకులు జరిగాయి. మరీ ముఖ్యంగా సంగీత దర్శకుల విషయంలో కేవలం దేవిశ్రీప్రసాద్ సినిమాలకే ఈ పాడురోగం అంటుకుంది. దేవిశ్రీ యూనిట్ లో ఎవరైనా ఈ లీకులకు పాల్పడుతున్నారా…. లేక సినిమాకు మరింత హైప్ తీసుకురావడం కోసం మేకర్సే కావాలని ఆడియో బిట్ రిలీజ్ చేస్తున్నారా….. కారణాలేమైనప్పటికీ… ఈ లీకుల వ్యవహారాలకు సంబంధించి దేవిశ్రీప్రసాద్ తనను తాను క్రాస్ చెక్ చేసుకుంటే మంచిది. అన్నట్టు లీకైన పాట మాత్రం ఇనిస్టెంట్ గా హిట్టయింది. సినిమాపై అంచనాల్ని మరింత పెంచేసింది.

First Published:  19 Dec 2015 7:03 PM GMT
Next Story