Telugu Global
Cinema & Entertainment

చిరంజీవి సినిమాలో అంజ‌లి ఐటం సాంగ్‌!

చిరంజీవి 150వ సినిమా ఖ‌రారైంది. త‌మిళ క‌త్తి రీమేక్‌కే మెగాస్టార్ మొగ్గు చూప‌డంతో ఇక త్వ‌ర‌లోనే సినిమా ప‌ట్టాలెక్క‌నుంది. ఈ చిత్రానికి  ద‌ర్శ‌కుడు వివి. వినాయ‌క్‌, నిర్మాత‌గా రామ్ చ‌ర‌ణ్ వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. సినిమా తెలుగు వ‌ర్ష‌న్‌పై క‌థా చ‌ర్చ‌లు వేగంగా సాగుతున్న‌ట్లు స‌మాచారం. చిరంజీవి సినిమా అంటే త‌ప్ప‌కుండా ఐటం సాంగ్ ఉంటుంది. చిరంజీవి హీరోగా చేసిన చిత్రం స్టాలిన్లో ఓ ఐటం సాంగ్‌లో అందాల భామ అనుష్క మెగాస్టార్‌తో ఆడిపాడిన సంగ‌తి తెలిసిందే! అయితే, క‌త్తిలో […]

చిరంజీవి సినిమాలో అంజ‌లి ఐటం సాంగ్‌!
X
చిరంజీవి 150వ సినిమా ఖ‌రారైంది. త‌మిళ క‌త్తి రీమేక్‌కే మెగాస్టార్ మొగ్గు చూప‌డంతో ఇక త్వ‌ర‌లోనే సినిమా ప‌ట్టాలెక్క‌నుంది. ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు వివి. వినాయ‌క్‌, నిర్మాత‌గా రామ్ చ‌ర‌ణ్ వ్య‌వ‌హ‌రించ‌నున్నారు. సినిమా తెలుగు వ‌ర్ష‌న్‌పై క‌థా చ‌ర్చ‌లు వేగంగా సాగుతున్న‌ట్లు స‌మాచారం. చిరంజీవి సినిమా అంటే త‌ప్ప‌కుండా ఐటం సాంగ్ ఉంటుంది. చిరంజీవి హీరోగా చేసిన చిత్రం స్టాలిన్లో ఓ ఐటం సాంగ్‌లో అందాల భామ అనుష్క మెగాస్టార్‌తో ఆడిపాడిన సంగ‌తి తెలిసిందే! అయితే, క‌త్తిలో ఐటం సాంగ్ చేసే అదృష్టం ఎవ‌రిని వ‌రిస్తుంద‌న్నది కొంత‌కాలంగా ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ చ‌ర్చ‌కు తాజాగా తెర‌ప‌డింది.
అంజ‌లిని వ‌రించిన అదృష్టం!
హీరో సూర్య సూప‌ర్ హిట్ సినిమా సింగం-2లో తెలుగు అమ్మాయి అంజ‌లి ఐటంసాంగ్ చేసి మాస్ జ‌నాల మ‌న‌సుల‌ను కొల్ల‌గొట్టింది. తాజాగా చిరంజీవి 150వ సినిమాలోనూ అంజ‌లితో ఓ ఐటం సాంగ్ ఉంటుంద‌ని ప్ర‌చారం సాగుతోంది. ఈ ఆఫ‌ర్ విష‌యం తెలిసి అంజ‌లి ఎగిరి గంతేసింద‌ని స‌మాచారం. ఇప్ప‌టికే వెంక‌టేశ్ ప‌క్క‌న సీత‌మ్మ చెట్టులో న‌టించిన అంజ‌లి తాజాగా బాల‌య్య సినిమా డిక్టేట‌ర్‌లోనూ చేస్తోంది. ఇక ఎప్ప‌టి నుంచో చిరంజీవి ప‌క్క‌న న‌టించాల‌న్న అంజ‌లి కోరిక క‌త్తి సినిమా ద్వారా తీరింద‌ని తెగ సంతోష‌ప‌డుతుంద‌ట ఈ బొద్దుగుమ్మ‌! పెద్ద హీరోల ప‌క్క‌న క‌థానాయిక‌గా స‌రిగ్గా స‌రిపోయే ఈ ముద్దుగుమ్మ‌కు వ‌రుస అవ‌కాశాలు తలుపు త‌డుతున్నాయి.
First Published:  20 Dec 2015 7:08 PM GMT
Next Story