Telugu Global
Others

రియల్‌ లైఫ్ విలన్లు

చట్టం అందరికీ సమానమే అని మన దేశంలో ఊదరగొడుతుంటారు. కానీ చట్టం ఎప్పుడూ ఉన్నోడి చుట్టమే. దేశంలో బ్యాంకులకు వేల కోట్ల అప్పులు ఎగవేస్తున్న బడాబాబులే అందుకు నిదర్శనం. సినిమాల్లో నీతులు చెప్పే హీరోలు, మార్గదర్శకులుగా కీర్తించబడే పారిశ్రామికవేత్తలు, వేదికలెక్కి ఉపన్యాసాలు దంచే రాజకీయ నాయకులే దేశంలో అతిపెద్ద రుణ ఎగవేత దారులు. వీరి వల్లే దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి ఏర్పడింది. ల్యాంకో, రిలయల్స్, జీఎంఆర్, జీవీకే, ఆదానీ వంటి పది ప్రముఖ సంస్థల […]

రియల్‌ లైఫ్ విలన్లు
X

చట్టం అందరికీ సమానమే అని మన దేశంలో ఊదరగొడుతుంటారు. కానీ చట్టం ఎప్పుడూ ఉన్నోడి చుట్టమే. దేశంలో బ్యాంకులకు వేల కోట్ల అప్పులు ఎగవేస్తున్న బడాబాబులే అందుకు నిదర్శనం. సినిమాల్లో నీతులు చెప్పే హీరోలు, మార్గదర్శకులుగా కీర్తించబడే పారిశ్రామికవేత్తలు, వేదికలెక్కి ఉపన్యాసాలు దంచే రాజకీయ నాయకులే దేశంలో అతిపెద్ద రుణ ఎగవేత దారులు. వీరి వల్లే దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి ఏర్పడింది.

ల్యాంకో, రిలయల్స్, జీఎంఆర్, జీవీకే, ఆదానీ వంటి పది ప్రముఖ సంస్థల మొండి బకాయిలే 3 లక్షల 12 వేల కోట్లుగా తేలింది. క్రెడిట్‌ ఇచ్చే ప్రముఖ సిబిల్ వైబ్‌సైట్ ఈ విషయాలను వెల్లడించింది. ఈ పది మంది పారిశ్రామికవేత్తలు అప్పులు చెల్లిస్తే ఆ సొమ్ముతో దేశంలో ఆరు కోట్ల మంది రైతుల రుణాలు పూర్తిగా రద్దు చేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. మన రాష్ట్రానికి చెందిన వారు కూడా వందల కోట్లు బకాయిలు చెల్లించకుండా బ్యాంకులను వేధిస్తున్నారు. వారిలో ప్రముఖ హీరో నాగార్జున కూడా ఉన్నారు. అన్నపూర్ణ స్డూడియోస్‌ ఒక్క ఆంధ్రా బ్యాంకు నుంచే 222. 54 కోట్ల అప్పు తీసుకున్నట్టు సిబిల్ వైబ్ సైట్ చెబుతోంది. అంతే కాదు ఉద్దేశపూర్వకంగా అప్పు చెల్లించని కంపెనీల జాబితాలో అన్నపూర్ణ స్డూడియోస్‌ను ఉంచారు. click to read: చంద్రబాబుపై కేసు వేస్తా…

click to read: బాబు విషయాలు కేవీపీకి చేరవేసింది ఎవరు?

ఆంధ్రప్రదేశ్ బ్యాంకు ఎంప్లాయిస్ ఫెడరేషన్ విడుదల చేసిన జాబితా ప్రకారం సుజనా చౌదరికి చెందిన సుజనా యూనివర్సల్ ఇండస్ట్ర్రీస్ సంస్థ రూ. 330 కోట్లు మొండి బకాయిగా ఉంది. డెక్కన్ క్రానికల్ సంస్థ వెయ్యి కోట్లకు పైగా అప్పు పడింది. లాంకో రూ. 500 కోట్ల అప్పు ఉంది. ఈ మొండి బకాయిల వల్ల బ్యాంకులు దివాళా అంచుకు చేరుతున్నాయి. దీంతో మొండి బకాయిల వసూలుకు బ్యాంకులు తమ సిబ్బందిని రంగంలోకి దింపుతున్నాయి. ఇటీవల మాజీ ఎంపీ, బీజేపీ నేత కావూరి సాంబశివరావుకు చెందిన ప్రొగ్రెసిల్ కన్‌స్ట్ర్రక్షన్ కంపెనీ ముందు బ్యాంకు ప్రతినిధులు మౌన ప్రదర్శన నిర్వహించారు. కావూరి కంపెనీ వివిధ బ్యాంకులకు రూ. వెయ్యి కోట్లు బకాయి పడింది. ఒక్క ఆంధ్రా బ్యాంకు సుల్తాన్ బజార్‌ బ్రాంచ్‌ నుంచే 200 కోట్లు తీసుకున్నారు. పలుమార్లు నోటీసులు జారీచేసినా కావూరి సంస్థ స్పందించలేదు. వీరంతా కావాలనే రుణాలు ఎగ్గొడుతున్నారని బ్యాంకుల ఆరోపణ. అయినా సరే వీరిపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవు. దేశంలో పారిశ్రామికవేత్తలు రాజకీయ పార్టీలను శాసిస్తుండడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

First Published:  21 Dec 2015 2:01 AM GMT
Next Story