Telugu Global
Others

సెటిలర్లు ఎవరి వైపు?

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఏక్షణమైనా నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే పార్టీలన్నీ వార్డులు, బస్తీల బాట పట్టాయి.  అయితే ఈ ఎన్నికల్లో అందరి ఫోకస్  సెటిలర్లపైనే ఉంది. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు సెటిలర్లు తమకు అండగా ఉంటారని ధీమాగా ఉంటే.. అధికార టీఆర్ఎస్ కూడా వారిని తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 8 అసెంబ్లీ సెగ్మెంట్లలో సెటిలర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బు ల్లాపూర్, సనత్‌నగర్, ఉప్పల్, […]

సెటిలర్లు ఎవరి వైపు?
X
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఏక్షణమైనా నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది. ఇప్పటికే పార్టీలన్నీ వార్డులు, బస్తీల బాట పట్టాయి. అయితే ఈ ఎన్నికల్లో అందరి ఫోకస్ సెటిలర్లపైనే ఉంది. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు సెటిలర్లు తమకు అండగా ఉంటారని ధీమాగా ఉంటే.. అధికార టీఆర్ఎస్ కూడా వారిని తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 8 అసెంబ్లీ సెగ్మెంట్లలో సెటిలర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, కుత్బు ల్లాపూర్, సనత్‌నగర్, ఉప్పల్, మల్కాజిగిరి, ఎల్బీనగర్, మలక్‌పేట వంటి నియోజకవర్గాల పరిధిలోని కార్పొరేటర్ల గెలుపులో కీలకపాత్ర వీరిదే.
ఇటీవల టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ అమరావతి శంకుస్థాపనకు వెళ్లడం, ఆ తర్వాత విజయవాడకు వెళ్లి చండీయాగానికి చంద్రబాబును కేసీఆర్ ఆహ్వానిండం లాంటి పరిణామాలతో సెటిలర్ల వైఖరిలో మార్పు వచ్చిందన్నది టీఆర్ఎస్ భావన. ఇదే సమయంలో ఆంధ్రా నేతలతో మంచి సంబంధాలు ఉన్న కేటీఆర్ జీహెచ్ఎంసీ ఎన్నికల బాధ్యతలు చేపట్టడం వెనుక కూడా వ్యూహం ఇదేనని తెలుస్తోంది. కేసీఆర్ ఉద్యమ సమయంలో ఆంధ్రులను ఉద్దేశించి పరుషంగా మాట్లాడినా ఇటీవలి పరిణామాలతో ఇక్కడి ఆంధ్రా ప్రజల్లో మార్పు వచ్చిందని అంచనా వేస్తున్నారు. ఇటీవల అమీర్‌పేటలో సెటిలర్స్ ఫ్రంట్ నేత, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన కేటీఆర్ తో కలసి చేపట్టిన ర్యాలీలో సెటిలర్లు భారీగా పాల్గొనడాన్ని వారు గుర్తు చేస్తున్నారు.
టీడీపీ నాయకులు కూడా టీఆర్ఎస్ పై ఎదురుదాడి చేసేందుకు వెనుకడాడుతున్నారు. చంద్రబాబు-కేసీఆర్ స్నేహితుల్లా కలసిపోయిన సంద్భంగా.. కేసీఆర్ ను విమర్శిస్తే తమకు రక్షణగా ఎవరుంటారన్న భావనలో టీటీడీపీ నాయకులు ఉన్నారు. ఇదే టీఆర్ఎస్ కు కలిసొస్తోంది. ఇప్పటికే మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా ఇక్కడి సెటిలర్లకు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ తరుఫున సీట్లిస్తామని ప్రకటించారు. దీంతో సెటిలర్ల తీరు మారుతోందట. చంద్రబాబు ఏపీకే పరిమితం అవుతున్నారు. వైసీపీ కూడా ఓ మాదిరి కేడర్ ఉన్నా.. ఈ పరిస్థితుల్లో ఇక్కడి నాయకులను నమ్మి ఓటేయడం కంటే అధికారంలో వున్న టీఆర్ఎస్ కు వేస్తేనే ప్రయోజనం ఉంటుందని సెటిలర్లు భావిస్తున్నారని తెలుస్తోంది. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు తమకూ అందాలని ఇక్కడి సెటిలర్లు భావిస్తున్నారు. అందుకే టీఆర్ఎస్ కు ఓటేస్తే ప్రభుత్వం కూడా తమకు అండగా ఉంటుందన్న భావనకు ప్రజలు వచ్చినట్టు తెలుస్తోంది. అటు కాంగ్రెస్ నేతలు మాత్రం సెటిలర్ల ఓట్లపై ఒక అంచనాకు రాలేకపోతున్నారు.
First Published:  20 Dec 2015 11:58 PM GMT
Next Story