ఏ మహిళా కావాలని భర్తను వదులుకోదు- ఎమ్మెల్యే కంటతడి

అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యే అనిత కంటతడి పెట్టారు. తనను రోజా దూషించారని ఆమె కన్నీరు పెట్టుకున్నారు. రెండు రోజులుగా రోజా వ్యాఖ్యలపై బాధపడుతున్నానని.. ఎలా స్పందించాలో తెలియక ఇంటి నుంచి బయటకు కూడా రాలేదన్నారు. భర్తను వదిలేశావని రోజా విమర్శించారని.. కానీ ఏ మహిళా కావాలని భర్తను వదులుకోదని అనిత అన్నారు. భర్తను వదులుకోవడానికి సవాలక్ష కారణాలుంటాయన్నారు. న్యాయం చేయాలని స్పీకర్‌ను ఆమె కోరారు. రోజా వ్యాఖ్యల తర్వాత తాను జనంలోకి కూడా వెళ్లలేకపోతున్నానని ఆవేదన చెందారు.click to read: నా జోలికి వస్తే నీ అంతు చూస్తా చంద్రబాబు.. జాగ్రత్త…  మహిళా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన రోజా జీవితంలో ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటు వేయాలని మంత్రి పీతల సుజాత కోరారు.