Telugu Global
Others

లోకేష్‌పై కోపం రోజాపై చూపారా?

రోజాను ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడంపై టీడీపీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అసలు ఈ ఆలోచన ఎవరిది?. ఆలోచించి తీసుకున్న నిర్ణయమేనా?. అప్పటికప్పుడు జరిగిపోయిందా అన్న దానిపై ఆరా తీస్తున్నారు నేతలు. అయితే ఏడాది సస్పెన్షన్ వెనుక అసలు సూత్రధారి ఆర్థిక శాఖతో పాటు శాసనసభ వ్యవహారాల శాఖనూ చూస్తున్న మంత్రి యనమల రామకృష్ణుడేనని చెప్పుకుంటున్నారు. రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేసిన సమయంలో ముఖ్యమంత్రితో సహా టీడీపీ నేతలెవ్వరూ వ్యతిరేకించలేదు. అయితే ఏకంగా […]

లోకేష్‌పై కోపం రోజాపై చూపారా?
X

రోజాను ఏడాది పాటు అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడంపై టీడీపీలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. అసలు ఈ ఆలోచన ఎవరిది?. ఆలోచించి తీసుకున్న నిర్ణయమేనా?. అప్పటికప్పుడు జరిగిపోయిందా అన్న దానిపై ఆరా తీస్తున్నారు నేతలు. అయితే ఏడాది సస్పెన్షన్ వెనుక అసలు సూత్రధారి ఆర్థిక శాఖతో పాటు శాసనసభ వ్యవహారాల శాఖనూ చూస్తున్న మంత్రి యనమల రామకృష్ణుడేనని చెప్పుకుంటున్నారు.

రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేసిన సమయంలో ముఖ్యమంత్రితో సహా టీడీపీ నేతలెవ్వరూ వ్యతిరేకించలేదు. అయితే ఏకంగా ఏడాదిపాటు సస్పెన్షన్ వేటు వేయడంపై అన్నిపార్టీల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ఆ సమయంలో అసలేం జరిగిందన్న దానిపై చంద్రబాబుతో పాటు ముఖ్యనేతలు పోస్టుమార్టం మొదలుపెట్టారు. చివరకు యనమలను చంద్రబాబు టీం తప్పుపడుతోందని సమాచారం. రోజాపై సస్పెన్షన్‌ వల్ల చాలా నష్టం జరిగిందని చంద్రబాబు ఆగ్రహంతో ఉన్నారట. అంతేకాదు ప్రతిపక్ష నేతపై సస్పెన్షన్‌ వేటు వేయడం సాధారణంగా కుదరదు. కానీ యనమల మాత్రం వైసీపీ సభ్యులను సస్పెండ్ చేసే సమయంలో జగన్‌ పేరు కూడా చదివారు. దీన్ని గమనించిన స్పీకర్ కోడెల జగన్‌ పేరు చదవలేదని చెబుతున్నారు. అయితే యనమలకు నిజంగా సభా నిబంధనలు తెలియవా అంటే .. ఆయన గతంలో చాలా కాలం పాటు స్పీకర్‌గా కూడా పనిచేశారు. ఇలా వరుస పరిణాలు చూసిన తర్వాత యనమల తీరుపై చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారట. యనమల కూడా మరో విషయంలో అసంతృప్తితో రగిలిపోతున్నారని చెబుతున్నారు.

ప్రతి విషయంలో లోకేష్ జోక్యాన్ని యనమల సహించలేకపోతున్నారట. ఎన్టీఆర్‌ను పదవి నుంచి దించేసే సమయంలో యనమల స్పీకర్‌గా ఉన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా బలనిరూపణ చేసుకునేందుకు యనమల చాలా సాయపడ్డారు. ఒక విధంగా నాడు చంద్రబాబు ఈజీగా సీఎం అవడానికి యనమలే కారణమని చెబుతుంటారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కావడానికి తనే కారణమన్నట్టుగా యనమల ఫీల్ అవుతుంటారని కొందరు పార్టీ ముఖ్యలు భావిస్తుంటారు. అలాంటి తనపై లోకేష్ సవారీ చేయడం యనమలకు ఏమాత్రం రుచించడం లేదని చెబుతున్నారు. ఇటీవల మంత్రుల పేషీల్లో మొత్తం తన అనుచరులను దింపిన లోకేష్ … యనమల పేషీపైనా ఈ ప్రయోగం చేయబోయారు. కానీ యనమల సీరియస్‌ కావడంతో ఆయన పేషీలో లోకేష్ పప్పులు ఉడకలేదని చెబుతున్నారు. అయినా కూడా లోకేష్ తీరు వల్ల చాలా సమయాల్లో యనమల నొచ్చుకుంటున్నారని టీడీపీ నేతలే చెప్పుకుంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే తనను రాజ్యసభకు పంపాలని యనమల పదేపదే కోరుతున్నారని పార్టీ నేతలు అంటున్నారు. click to read: బాబుకు రూ. కోటిన్నరతో కొత్త వాహనం

ఏపీలో ఉండడం కన్నా ఢిల్లీలోనే ఉండడం బెటర్ అన్న పరిస్థితిని తయారు చేసుకునేందుకు యనమల ప్రయత్నిస్తున్నారని చెవులు కొరుక్కుంటున్నారు. ఇందులో భాగంగానే రోజాపై ఏడాది వేటు ఎత్తుగడ వేశారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అయితే రోజాపై వేటు వేసినప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలంతా హ్వాపీగా ఫీలయ్యారని… కానీ అనంతరం ఈ అంశంలో చెడ్డపేరు రావడంతో తప్పంతా యనమలదే అన్నట్టు మాట్లాడడం ఎంతవరకు సమంజసమని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

First Published:  23 Dec 2015 12:13 AM GMT
Next Story