Telugu Global
Cinema & Entertainment

బాల‌య్య చేస్తాడా ?

తమిళ స్టార్ అజిత్ హీరోగా ఇటీవల ఘనవిజయం సాధించిన సినిమా వేదలం. సిస్టర్ సెంటిమెంట్ తో మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా వరదల సమయంలో రిలీజ్ అయినా, భారీ కలెక్షన్లను వసూలు చేసింది. ముఖ్యంగా దర్శకుడు శివ టేకింగ్ కు మంచి మార్కులు పడ్డాయి. దీంతో ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. తెలుగులో ఈ సినిమాను యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కించడానికి ప్రయత్నాలు జరిగాయి. అయితే కెరీర్ […]

బాల‌య్య చేస్తాడా ?
X

తమిళ స్టార్ అజిత్ హీరోగా ఇటీవల ఘనవిజయం సాధించిన సినిమా వేదలం. సిస్టర్ సెంటిమెంట్ తో మాస్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా వరదల సమయంలో రిలీజ్ అయినా, భారీ కలెక్షన్లను వసూలు చేసింది. ముఖ్యంగా దర్శకుడు శివ టేకింగ్ కు మంచి మార్కులు పడ్డాయి. దీంతో ఈ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.

తెలుగులో ఈ సినిమాను యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కించడానికి ప్రయత్నాలు జరిగాయి. అయితే కెరీర్ స్టార్టింగ్ నుంచి రీమేక్ సినిమాల మీద పెద్దగా ఇంట్రస్ట్ చూపించని జూనియర్.. ఈ ప్రాజెక్ట్ ను కూడా పక్కన పెట్టేశాడు. దీంతో బాలకృష్ణ హీరోగా ఈ సినిమాను తెరకెక్కించాలని భావిస్తున్నారు. ఇప్పటికే బాలయ్యను కలిసిన వేదలం నిర్మాతలు ఆయన అంగీకారం కోసం వెయిట్ చేస్తున్నారు.

First Published:  22 Dec 2015 7:12 PM GMT
Next Story