Telugu Global
Others

సంరక్షణ కు హామీ లేదు... శిక్షలకు మాత్రం ముందుంటాం

Juvenile care and protection act లో విజయవంతంగా శిక్షని కూడా కలిపేశాం. శుభం. వీడు ఎలాగూ తప్పించుకున్నాడు.మళ్ళీ ఎవరో ఒకరు దొరక్కపోరు ఊరి తియ్యటానికి. అప్పటిదాకా గుండెల మీద చెయ్యెసుకుని నిద్ర పొదామా?  మరి అదే చట్టం మొదటిసారి 2000 లలో వచ్చినప్పటినుంచి పట్టించుకోకుండా మళ్ళీ కొత్త చట్టం లో కూడా ప్రస్తావించిన మిగిలిన 99 రకాల అంశాలను ఇప్పటికైనా పట్టించుకుంటారా? పిల్లల మానసిక, ఆరోగ్య, బౌద్దిక వికాసానికి హామీ పడుతూ వాళ్ళు criminalise కాకుండా […]

సంరక్షణ కు హామీ లేదు... శిక్షలకు మాత్రం ముందుంటాం
X

vanaja (2)Juvenile care and protection act లో విజయవంతంగా శిక్షని కూడా కలిపేశాం. శుభం. వీడు ఎలాగూ తప్పించుకున్నాడు.మళ్ళీ ఎవరో ఒకరు దొరక్కపోరు ఊరి తియ్యటానికి. అప్పటిదాకా గుండెల మీద చెయ్యెసుకుని నిద్ర పొదామా? మరి అదే చట్టం మొదటిసారి 2000 లలో వచ్చినప్పటినుంచి పట్టించుకోకుండా మళ్ళీ కొత్త చట్టం లో కూడా ప్రస్తావించిన మిగిలిన 99 రకాల అంశాలను ఇప్పటికైనా పట్టించుకుంటారా? పిల్లల మానసిక, ఆరోగ్య, బౌద్దిక వికాసానికి హామీ పడుతూ వాళ్ళు criminalise కాకుండా చేపట్టాల్సిన చాలా చర్యల గురించి ఈ రెండు చట్టాల్లో ఉంది. వాటిని అమలు చేస్తారా? లేదా కన్నందుకు పెంచాల్సిన భాద్యత లేకపోయినా తప్పు చేస్తే మాత్రం శిక్ష వేసే అధికారం ఉందనుకునే బాధ్యత రహితుడైన తాగుబోతు తండ్రి పద్దతేనా?

చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు తరగతి గదిలో బల్ల మీద కర్ర పెట్టి కుర్చీలో నిద్రపోవటానికి దీనికి తేడా ఏమైనా ఉందా? కర్ర చూసి కూడా భయపడని పిల్లలు అల్లరి చేస్తే చావగొట్టే హక్కు ఉందనుకునే టీచర్ కి ఎవరు చెప్పాలి చదువు చెప్పటం కదా నీ భాధ్యత అని. చెప్తే వినే సంస్కారం ఉండాలి కదా. దుడ్డుకర్ర సంస్కృతి తప్పని అమలుకాని చట్టాలు తెచ్చుకున్నాం కదా మరి అదే చట్టాన్ని ప్రభుత్వాలే మరోలా ఉల్లంఘిస్తే ఎలా అర్ధం చేసుకోవాలి?

అన్నట్లు ఈ బిల్లు పాస్ చేయటానికి ప్రభుత్వం స్వయంగా మనేకా గాంధీ చెప్పిన అబద్దాల్లో ఒకటి ఏంటంటే తీవ్రమైన నేరాలు చేస్తున్న పిల్లల సంఖ్య మన దేశంలో లక్షల్లో ఉంది అని. కానీ juvenile homes మాజీ డైరెక్టర్ కిస్మత్ కుమార్ చెప్పిన ప్రకారం ఆ మొత్తం సంఖ్య 31 వేలు. ఇది చిన్న సంఖ్యా పెద్ద సంఖ్యా అని నేను మాట్లాడట్లేదు. అసలే ఉద్వేగాలు ఎక్కువ ఉన్న సమయంలో ఇలాంటి అబద్దాలు చెప్పటం ఎటువంటి సంస్కారం? ఆయన మరో మాట కూడా చెప్పారు నేరాలు చేసిన పిల్లలతో తను పని చేసిన అనుభవం నుంచి. టీనేజ్ నేరస్తుల్లో మెజారిటీ పిల్లల్లో 24 రకాల మానసిక వైకల్యాలు గుర్తించారట. చిన్న చితకా నేరాల నుంచి పెద్ద నేరాలు చేసే వాల్ల వరకూ అందరిలోనూ ఏదో ఒక వైకల్యం ఉంటుందట. చిన్న నేరం చేసినప్పుడే దాని గుర్తించి బాగు చేస్తే వాళ్ళు పెద్ద నేరాలకు వెళ్లకుండా చెయ్యొచనేది ఆయన అనుభవం మాత్రమే కాదు అనేక మంది పిల్లలతో పనిచేసిన వాళ్ళ అనుభవం. అందుకోసమే ఏర్పడ్డ లేదా ఏర్పడాల్సిన పిల్లల పునరావాస కేంద్రాలు ఆ పని చేయకపోతే ఆ భాద్యత ఎవరిది?

ఇలాటి నేరాలకు పాల్పడుతున్న వాళ్ళలో మెజారిటీ దారిద్ర్య రేఖ కింద నుంచి రావటమే కాదు జీవితం లో కీలకమైన రెండు వ్యవస్థలు – ఇల్లు, స్కూలు – వాళ్ళ జీవితాల్లో లోపిస్తున్నాయి. దీనికి భాద్యత కన్నవాళ్ళదే అని చేతులు దులుపుకోవచ్చు. కానీ చట్టం, రాజ్యాంగం ఆ భాధ్యత ప్రభుత్వానిదే అని చెప్తుంది. అలా అని మన దేశం అనేక అంతర్జాతీయ వేదికల మీద అంగీకరించి సంతకం పెట్టి వచ్చింది కూడా.

ఈ భాద్యతలు ఏవీ మావి కాదు అంటే మాది ప్రపంచంలోనే అత్యంత యవ్వనవంతమైన దేశం అని డబ్బా కొట్టుకోవటం మానండి. ఈ దేశంలో ఆడవాళ్ళుగా పిల్లలుగా పుట్టటమే ఒక శాపం అనుకునే స్థితికి కల్పించకండి.

దేశంలో 40 శాతం మంది 18 ఏళ్ల కన్నా తక్కువ వయసు వాళ్ళు. అంటే 50 ఓట్లకు పైగా పిల్లలున్న దేశం ఇది. అమలు కానీ విద్యా హక్కు వంటి చట్టాలే తప్ప 50 కోట్ల మంది కి సంబంధించి ఒక సమగ్ర విధానం కానీ అది అమలు చేయటానికి ఒక వ్యవస్థలు కానీ లేని దేశం కూడా మనదే. ఉన్నఅరా కొర వ్యవస్థలు కూడా పూర్తిగా బ్రష్టు పట్టిన స్థితి. ఇంకో వైపు గ్రేట్ ఇండియన్ వీధుల్లో, అంతర్జాలంలో, మాధ్యమాల్లో పిల్లలు criminalise కావటానికి పుష్కలంగా అవకాశాలు.

కాబట్టి ఇప్పటికైనా సమస్యకు మూలాలను గుర్తించి పని చేయండి నాయన. అందులోనూ వాడిని చంపాల్సిందే అని వీరంగం వేసిన వాళ్ళంతా మళ్ళీ మరొకడు ఇదే పని చేసి దొరికితే వాడిని ఉరితియ్యండి అని అరవటం కోసం ముసుగు తన్ని పడుకోకుండా మరింత మంది పిల్లలు ఇలా కాకుండా, మరిన్ని ఇలాంటి నేరాలు జరక్కుండా ఆపడానికి చెయ్యాల్సిన పనులు కూడా చెయ్యమని ఏలిన వారికి చెప్పండి. వాడిని లేదా వాడిలాంటి వాళ్ళను చంపేయాల్సిందే అని మీరడిగితే విన్నారు కాబట్టి ఇది కూడా మీరే అడిగితే వింటారేమో. లేదా పిల్లల భాద్యత పట్టని తాగుబోతుల తండ్రుల్లో ఒకరుగా మారతారా చూసుకోండి.

First Published:  23 Dec 2015 11:16 PM GMT
Next Story