Telugu Global
Cinema & Entertainment

అఖిల్ సృష్టించిన అగాథాన్ని నాగ్ పూడుస్తాడా !

ప్రస్తుతం అక్కినేని ఫ్యాన్స్ అంతా ఫుల్ డిసప్పాయింట్ మెంట్ తో ఉన్నారు. అఖిల్ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో ఫ్యాన్స్ అంతా నీరుగారిపోయారు. కనీసం తొలి సినిమా యావరేజ్ గా నడిచినా… సంబరాలు చేసుకుందామని చూసిన అభిమానులకు ఆ చిన్న అవకాశం కూడా ఇవ్వలేదు హీరో అఖిల్. టోటల్ గా అఖిల్ మూవీ డిజాస్టర్ అనే పేరుతెచ్చుకుంది. ఇలాంటి టైమ్ లో…. ఫ్యాన్స్ అంతా నాగార్జున వైపు ఆశగా చూస్తున్నారు. ఎందుకంటే.. ఈసారి సంక్రాంతి హీరోగా నిలిచాడు […]

అఖిల్ సృష్టించిన అగాథాన్ని నాగ్ పూడుస్తాడా !
X
ప్రస్తుతం అక్కినేని ఫ్యాన్స్ అంతా ఫుల్ డిసప్పాయింట్ మెంట్ తో ఉన్నారు. అఖిల్ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడంతో ఫ్యాన్స్ అంతా నీరుగారిపోయారు. కనీసం తొలి సినిమా యావరేజ్ గా నడిచినా… సంబరాలు చేసుకుందామని చూసిన అభిమానులకు ఆ చిన్న అవకాశం కూడా ఇవ్వలేదు హీరో అఖిల్. టోటల్ గా అఖిల్ మూవీ డిజాస్టర్ అనే పేరుతెచ్చుకుంది. ఇలాంటి టైమ్ లో…. ఫ్యాన్స్ అంతా నాగార్జున వైపు ఆశగా చూస్తున్నారు. ఎందుకంటే.. ఈసారి సంక్రాంతి హీరోగా నిలిచాడు నాగ్. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాతో రేసులోకి వచ్చాడు. జనవరి 15న రాబోతున్న ఈ సినిమా హిట్టయితే… అఖిల్ మిగిల్చిన విషాదాన్ని మరిచిపోవచ్చని భావిస్తున్నారు. మరి అఖిల్ సృష్టించిన అగాథాన్ని నాగ్ పూడుస్తాడా…. ఫ్యాన్స్ లో ఆనందాన్ని నింపుతాడా… అభిమానులకు సిసలైన సంక్రాంతిని తీసుకొస్తాడా… ప్రస్తుతానికైతే ఈ ప్రశ్నలకు జవాబుల్లేకపోయినా…. సోగ్గాడే చిన్ని నాయనా సినిమాపై అంచనాలైతే బాగానే ఉన్నాయి. చాలా ఏళ్ల తర్వాత నాగార్జున ద్విపాత్రాభినయం చేసిన సినిమా కావడం ఒక కారణమైతే… కెరీర్ లో ఫస్ట్ టైమ్ తండ్రీకొడుకు పాత్రల్లో నాగార్జున నటించడం ఇంకో కారణం. దీనికి తోడు ఇప్పటికే విడుదలైన ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ రావడంతో నాగ్ కూడా హోప్స్ పెట్టుకున్నాడు.
First Published:  23 Dec 2015 7:03 PM GMT
Next Story