Telugu Global
Cinema & Entertainment

నాన్నకు ప్రేమతో ఆడియో షురూ

నెల రోజులు గా నాన్నకు ప్రేమతో సినిమాపై రూమర్లు వస్తూనే ఉన్నాయి. సంక్రాంతి బరి నుంచి మూవీ తప్పుకుంటున్నట్టు తెగ ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్లకు చెక్ పెడుతూ…. మరో ప్రెస్ నోట్ విడుదల చేశారు మేకర్స్. ఈసారి ఆడియో ఫంక్షన్ తేదీని ప్రకటించారు. ఈనెల 27న నాన్నకు ప్రేమతో ఆడియోను విడుదల చేస్తామని…. ఎట్టిపరిస్థితుల్లో సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13కు తీసుకొస్తామని మేకర్స్ ప్రకటించారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. కానీ విశ్లేషకులు మాత్రం […]

నాన్నకు ప్రేమతో ఆడియో షురూ
X
నెల రోజులు గా నాన్నకు ప్రేమతో సినిమాపై రూమర్లు వస్తూనే ఉన్నాయి. సంక్రాంతి బరి నుంచి మూవీ తప్పుకుంటున్నట్టు తెగ ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్లకు చెక్ పెడుతూ…. మరో ప్రెస్ నోట్ విడుదల చేశారు మేకర్స్. ఈసారి ఆడియో ఫంక్షన్ తేదీని ప్రకటించారు. ఈనెల 27న నాన్నకు ప్రేమతో ఆడియోను విడుదల చేస్తామని…. ఎట్టిపరిస్థితుల్లో సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 13కు తీసుకొస్తామని మేకర్స్ ప్రకటించారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు. కానీ విశ్లేషకులు మాత్రం ఇంకా అనుమానాలు ప్యక్తంచేస్తూనే ఉన్నారు. మేకర్స్ చెబుతున్నట్టు ఆడియో ఫంక్షన్ ను ఈనెల 27న జరిపించినా…. సినిమా విడుదలపై మాత్రం చాలా మంది అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. బాలయ్య సినిమా డిక్టేటర్ రావడం గ్యారెంటీ అనే సంకేతాల మధ్య…. నాన్నకు ప్రేమతో సినిమా రిలీజ్ పై సందిగ్దం నెలకొంది.
First Published:  24 Dec 2015 7:02 PM GMT
Next Story