Telugu Global
Others

ఎంపీల వేత‌నం రెండింత‌లు

పార్ల‌మెంటు స‌భ్యుల వేత‌నాలు త్వ‌ర‌లో రెండింత‌లు కానున్నాయి. శీతాకాల స‌మావేశాలు స‌రిగా జ‌ర‌గ‌లేద‌ని దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్న వేళ ఎంపీల వేత‌న పెంపుపై ప‌లువురు మండిప‌డుతున్నారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో మొద‌ల‌య్యే 2016 బ‌డ్జెట్  స‌మావేశాల్లో ఈ పెంపున‌కు సంబంధించిన ప్ర‌తిపాద‌న పార్లమెంటు ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉంది. దీనికి కేంద్ర ఆర్థిక మంత్రితోపాటు ఉభ‌య స‌భల ఎంపీలు ఆమోదం తెలిపిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఈ పెంపు అమ‌ల్లోకి వ‌స్తే ప్రస్తుతం రూ.50 వేలుగా ఉన్న ఎంపీల […]

ఎంపీల వేత‌నం రెండింత‌లు
X
పార్ల‌మెంటు స‌భ్యుల వేత‌నాలు త్వ‌ర‌లో రెండింత‌లు కానున్నాయి. శీతాకాల స‌మావేశాలు స‌రిగా జ‌ర‌గ‌లేద‌ని దేశ‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు వెల్లువెత్తుతున్న వేళ ఎంపీల వేత‌న పెంపుపై ప‌లువురు మండిప‌డుతున్నారు. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో మొద‌ల‌య్యే 2016 బ‌డ్జెట్ స‌మావేశాల్లో ఈ పెంపున‌కు సంబంధించిన ప్ర‌తిపాద‌న పార్లమెంటు ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉంది. దీనికి కేంద్ర ఆర్థిక మంత్రితోపాటు ఉభ‌య స‌భల ఎంపీలు ఆమోదం తెలిపిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. ఈ పెంపు అమ‌ల్లోకి వ‌స్తే ప్రస్తుతం రూ.50 వేలుగా ఉన్న ఎంపీల జీతం ఇక నుంచి నెల‌కు రూ.ల‌క్ష అవుతుంది. అలాగే వారికి ప్ర‌తి నెలా ఇచ్చే నియోజ‌క‌వ‌ర్గం భ‌త్యం రూ.45 వేల నుంచి రూ.90 వేల‌కు పెర‌గ‌నుంది. చివ‌రిసారిగా ఎంపీల‌కు వేత‌నాలు 2010లో పెరిగాయి. ఈ పెంపుపై పార్టీల‌కు అతీతంగా ప్ర‌తి ఎంపీ ఆస‌క్తి క‌న‌బ‌ర‌చ‌డం విశేషం.
ప్ర‌జాస‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో కొన్నేళ్లుగా పార్ల‌మెంటు (రాజ్య‌స‌భ‌+ లోక్‌స‌భ‌) స‌భ్యులు పూర్తి స్థాయిలో స‌ఫ‌లీకృతం కాలేక‌పోతున్నార‌న్న విమ‌ర్శ అలాగే కొన‌సాగుతోంది. వ్య‌క్తిగ‌త పంతాల‌కు పోయి విలువైన పార్ల‌మెంటు స‌మ‌యాన్ని వృథా చేస్తున్నారే త‌ప్ప స‌మ‌స్య ప‌రిష్కారానికి, అర్థ‌వంత‌మైన చ‌ర్చ‌ల‌పై ఆస‌క్తి చూప‌క‌పోవ‌డం దుర‌దృష్ట‌క‌రం. ప్ర‌తిప‌క్షం, అధికార ప‌క్షం అన్న తేడా లేకుండా ఈ విష‌యంలో ఎవ‌రికి ఎవ‌రూ తీసిపోరు. ఈసారి రాజ్య‌స‌భకు ఇచ్చిన స‌మ‌యంలో స‌గం మాత్రమే వినియోగించుకోగ‌లిగింది. వృథా స‌మ‌యానికి అయిన ఖ‌ర్చును లెక్క‌గ‌డితే దాని విలువ అక్ష‌రాల రూ.9.9 కోట్లు దాదాపు రూ.10 కోట్లు! ప్ర‌జ‌లు త‌మ‌కు న‌చ్చిన నాయ‌కుడిని ఓట్ల ద్వారా ఎన్నుకుని పార్ల‌మెంటుకు పంపుతున్నారు. వారు క‌ట్టే ప‌న్నుల‌తో స‌భ న‌డుస్తోంది. ప్ర‌తి నిమిషానికి పార్ల‌మెంటు నిర్వ‌హ‌ణ‌కు అయ్యే ఖ‌ర్చు రూ.2.5 ల‌క్ష‌లు. అంటే ఒక రోజుకు దాదాపు రూ.6కోట్ల ఖ‌ర్చ‌వుతుంది. ఏడాదిలో మూడు సెష‌న్ల‌కు క‌లిపి దాదాపు రూ.600 కోట్ల బ‌డ్జెట్‌. ఇదంతా ప్ర‌జ‌లు ప‌న్నుల రూపంలో చెల్లించిన డ‌బ్బే క‌దా!
ప్ర‌జాస్వామ్యానికి ప్ర‌తిరూప‌మైన చ‌ట్ట‌స‌భ‌ల్లో ప్ర‌జా సమస్య‌లే చ‌ర్చ‌కు రాక‌పోవ‌డంపై ఇటీవ‌ల రాష్ట్రప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. వ‌రుస ఆందోళ‌న‌లు, నిర‌స‌న‌ల‌తో క్రితం సారి జ‌రిగిన వ‌ర్షాక‌ల‌ పార్ల‌మెంటు స‌మావేశాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన సంగ‌తి తెలిసిందే! నిబంధ‌న‌ల ప్ర‌కారం ఏటా వేస‌వి, వ‌ర్షాకాలం, శీతాకాలం మూడు సెష‌న్ల‌లో పార్ల‌మెంటు న‌డ‌వాలి. అవి న‌డిచేందుకు పార్టీలు బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించ‌డం లేదు. ప్ర‌తిసారీ అధికార‌ప‌క్షంలో ఉన్న పార్టీ, ప్ర‌తిప‌క్షాన్ని బుజ్జ‌గించాల్సిన ప‌రిస్థితి క‌నిపిస్తోంది.
నిమిషాల‌కు ల‌క్ష‌ల ప్ర‌జాధ‌నంతో స‌భ‌ను నిర్వ‌హిస్తుంటే.. బాధ్య‌త క‌లిగిన ఎంపీలు ఆ డ‌బ్బును త‌మ పార్టీ ప్ర‌యోజ‌నాల‌కు దుర్వినియోగం చేస్తుండ‌టంపై స‌ర్వ‌త్రా ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది.
First Published:  24 Dec 2015 9:00 PM GMT
Next Story