Telugu Global
Cinema & Entertainment

హరికృష్ణకు గుర్తులేని బాలకృష్ణ

నాన్నకు ప్రేమలో ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌కు బాలకృష్ణ వస్తారని కొద్ది రోజుల క్రితం వార్తలొచ్చాయి. కానీ అది జరగలేదు. అంతే కాదు అభిమానులకు నమస్కరిస్తూ నందమూరి అభిమానులు, ఎన్టీఆర్‌ అభిమానులు, కల్యాణ్‌రామ్ అభిమానులకు పాదాభివందనాలు అని హరికృష్ణ అన్నారు. కానీ ఎక్కడా కూడా బాలకృష్ణ అభిమానులు అని మాత్రం అనలేదు. నందమూరి అభిమానుల్లో బాలయ్య అభిమానులను కలిపేశారనుకునేందుకు ”ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్ అభిమానులు” అంటూ ప్రత్యేకంగా ప్రస్తావించారు కదా!. బాలకృష్ణ అభిమానులను మాత్రం ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావించలేదు. […]

హరికృష్ణకు గుర్తులేని బాలకృష్ణ
X

నాన్నకు ప్రేమలో ఆడియో రిలీజ్‌ ఫంక్షన్‌కు బాలకృష్ణ వస్తారని కొద్ది రోజుల క్రితం వార్తలొచ్చాయి. కానీ అది జరగలేదు. అంతే కాదు అభిమానులకు నమస్కరిస్తూ నందమూరి అభిమానులు, ఎన్టీఆర్‌ అభిమానులు, కల్యాణ్‌రామ్ అభిమానులకు పాదాభివందనాలు అని హరికృష్ణ అన్నారు. కానీ ఎక్కడా కూడా బాలకృష్ణ అభిమానులు అని మాత్రం అనలేదు. నందమూరి అభిమానుల్లో బాలయ్య అభిమానులను కలిపేశారనుకునేందుకు ”ఎన్టీఆర్‌, కల్యాణ్‌ రామ్ అభిమానులు” అంటూ ప్రత్యేకంగా ప్రస్తావించారు కదా!.

బాలకృష్ణ అభిమానులను మాత్రం ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావించలేదు. ఇదే ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీన్ని బట్టి చూస్తుంటే బాలకృష్ణ అభిమానులను హరికృష్ణ తమవారిగా చూడడం లేదా అన్న అనుమానం కలుగుతుంది. ఈ సంక్రాంతికి నందమూరి కుటుంబం నుంచి నాన్నకు ప్రేమతో, డిక్టేటర్ రెండూ వస్తున్నాయి. కానీ హరికృష్ణ మాట వరుసకైనా రెండు చిత్రాలను ఆదరించాలని అని మాత్రం అనలేదు. అయితే హరికృష్ణ ఇలా చేయడం యాదృచ్చికంగా జరిగిందా లేక కావాలనే విస్మరించారా అన్నది తెలియాలి. ఏదిఏమైనా నందమూరి కుటుంబం మొత్తం కలిసి ఉండాలన్నది అభిమానుల ఆకాంక్ష.

First Published:  28 Dec 2015 12:40 AM GMT
Next Story