Telugu Global
Cinema & Entertainment

భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయిన ఎన్టీఆర్

సినిమా మీద వ‌స్తున్న రూమ‌ర్ల‌ను ప‌క్క‌కు నెడుతూ ఆదివారం రాత్రి హైద‌రాబాద్‌లో నాన్న‌కు ప్రేమ‌తో ఆడియో వేడుక ఘ‌నంగా జ‌రిగింది. వేదిక‌పై అందరూ మాట్లాడిన‌ప్ప‌టికీ ఆఖ‌ర్లో ఎన్టీఆర్ ప్ర‌సంగం అంద‌రినీ క‌దిలించి వేసింది. అంత‌కంటే కంట‌త‌డి పెట్టించింది. సినిమా తీసేందుకు ఎవరైనా క‌ష్ట‌ప‌డ‌తారు. ఎన్టీఆర్ మాట‌ల ప్ర‌కారం.. ఈ సినిమాకు ప‌నిచేసిన టెక్నీషియ‌న్లంతా నాన్నంటే ప‌డి చ‌చ్చేవారేనంట‌. మేమంతా నాన్న పిచ్చోళ్లం అంటూ మ‌న‌సులో మాట చెప్పాడు జూనియ‌ర్‌. నాన్న‌కు ప్రేమ‌తో సినిమా ద‌ర్శ‌కుడు సుకుమార్ నాన్న‌గారు […]

భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయిన ఎన్టీఆర్
X
సినిమా మీద వ‌స్తున్న రూమ‌ర్ల‌ను ప‌క్క‌కు నెడుతూ ఆదివారం రాత్రి హైద‌రాబాద్‌లో నాన్న‌కు ప్రేమ‌తో ఆడియో వేడుక ఘ‌నంగా జ‌రిగింది. వేదిక‌పై అందరూ మాట్లాడిన‌ప్ప‌టికీ ఆఖ‌ర్లో ఎన్టీఆర్ ప్ర‌సంగం అంద‌రినీ క‌దిలించి వేసింది. అంత‌కంటే కంట‌త‌డి పెట్టించింది. సినిమా తీసేందుకు ఎవరైనా క‌ష్ట‌ప‌డ‌తారు. ఎన్టీఆర్ మాట‌ల ప్ర‌కారం.. ఈ సినిమాకు ప‌నిచేసిన టెక్నీషియ‌న్లంతా నాన్నంటే ప‌డి చ‌చ్చేవారేనంట‌. మేమంతా నాన్న పిచ్చోళ్లం అంటూ మ‌న‌సులో మాట చెప్పాడు జూనియ‌ర్‌. నాన్న‌కు ప్రేమ‌తో సినిమా ద‌ర్శ‌కుడు సుకుమార్ నాన్న‌గారు ఆఖ‌రి క్ష‌ణాల్లో ఉన్న‌పుడు త‌ట్టిన క‌థ అని, ఈ సినిమాలో తాను క‌నిపించ‌న‌ని సుకుమారే క‌నిపిస్తార‌ని కొనియాడారు. సుకుమార్ జీవితంలో జరిగిన ఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ క‌థ పురుడు పోసుకుంద‌ని చెప్పాడు. వెంట‌నే సుకుమార్ క‌న్నీటి ప‌ర్యంత‌మై ఎన్టీఆర్ వ‌చ్చి హ‌త్తుకున్నాడు.
సంగీత ద‌ర్శ‌కుడు దేవీని కూడా ఆకాశానికెత్తాడు ఎన్టీఆర్‌. దేవీ శ్రీ‌ప్ర‌సాద్ తండ్రి (స‌త్య‌మూర్తి) చనిపోయిన రెండోరోజు ఆ బాధ‌ను దిగ‌మింగుకుని ర‌కుల్‌తో పాట పాడించి వృత్తిప‌ట్ల త‌న‌కున్న‌నిబ‌ద్ద‌త‌ను చాటుకున్న గొప్ప‌వ్యక్తి అని చెప్పాడు. ఈ మాట విన‌గానే దేవీ వ‌చ్చి ఎన్టీఆర్ ప‌ట్టుకుని ఏడ్చేశాడు. చాలా సార్లు ఎన్టీఆర్ త‌న భావోద్వేగాన్ని ఆపుకోలేక కంటత‌డి పెట్టాడు. మేమంతా నాన్న పిచ్చోళ్ల‌మండి, మేము సినిమాకు ప‌డిన క‌ష్టాన్ని మీరే తెర‌మీద చూసి ఆనందిస్తార‌ని చెప్పారు. ఇక ఈ సినిమాలో జూనియ‌ర్‌ తండ్రి పాత్ర వేసిన రాజేంద్ర‌ప్రసాద్‌, ప్ర‌తినాయ‌కులైన జ‌గ‌ప‌తిబాబుల‌పైనా ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించాడు ఎన్టీఆర్‌. వేడుక అనంత‌రం అంతా క్షేమంగా ఇంటికెళ్లండి..మా ఇంట్లో జ‌రిగిన విషాదం ( రోడ్డు ప్ర‌మాదంలో అన్న జాన‌కీరామ్ మృతి) ఇంకెవ‌రి ఇంట్లోనూ జ‌ర‌గ‌కూడ‌ద‌ని కోరుకుంటున్నాన‌ని జాగ్ర‌త్త‌లు చెప్పాడు.
First Published:  27 Dec 2015 5:06 PM GMT
Next Story