Telugu Global
Others

2015 చెప్పిన సీక్రెట్స్‌

  శాస్త్ర‌వేత్త‌లు మ‌న ఆరోగ్యానికి సంబంధించిన ప‌లు అంశాల‌మీద  ప‌రిశోధ‌న‌లు, అధ్య‌య‌నాలు చేయ‌డం, ఆ ఫ‌లితాల‌ను వెల్ల‌డించ‌డం  నిరంత‌రం జ‌రుగుతూనే ఉంటుంది.  ఈ సంవ‌త్స‌రం సైంటిస్టులు వెలువ‌రించిన ప‌రిశోధ‌నా ఫ‌లితాల్లో ఎక్కువ మందిని ఆక‌ర్షించిన‌వి ఇవి- కుక్క‌ల‌కు వాస‌న‌ల‌ను గ్ర‌హించే శ‌క్తి ఎక్కువ‌గా ఉంటుంద‌ని తెలిసిందే. అయితే ఇవి ఒక వ్య‌క్తి యూరిన్‌ని స్మెల్ చేసి ఆ వ్య‌క్తికి ప్రొస్టేట్ క్యాన్స‌ర్ ఉందా, లేదా అనే విష‌యాన్ని చెప్పేస్తాయ‌ట‌. జ‌ర్మ‌న్ షెప్ప‌ర్డ్ కుక్క‌ల‌కు  సైంటిస్టులు  ఈ విధ‌మైన […]

2015 చెప్పిన సీక్రెట్స్‌
X

శాస్త్ర‌వేత్త‌లు మ‌న ఆరోగ్యానికి సంబంధించిన ప‌లు అంశాల‌మీద ప‌రిశోధ‌న‌లు, అధ్య‌య‌నాలు చేయ‌డం, ఆ ఫ‌లితాల‌ను వెల్ల‌డించ‌డం నిరంత‌రం జ‌రుగుతూనే ఉంటుంది. ఈ సంవ‌త్స‌రం సైంటిస్టులు వెలువ‌రించిన ప‌రిశోధ‌నా ఫ‌లితాల్లో ఎక్కువ మందిని ఆక‌ర్షించిన‌వి ఇవి-

  • కుక్క‌ల‌కు వాస‌న‌ల‌ను గ్ర‌హించే శ‌క్తి ఎక్కువ‌గా ఉంటుంద‌ని తెలిసిందే. అయితే ఇవి ఒక వ్య‌క్తి యూరిన్‌ని స్మెల్ చేసి ఆ వ్య‌క్తికి ప్రొస్టేట్ క్యాన్స‌ర్ ఉందా, లేదా అనే విష‌యాన్ని చెప్పేస్తాయ‌ట‌. జ‌ర్మ‌న్ షెప్ప‌ర్డ్ కుక్క‌ల‌కు సైంటిస్టులు ఈ విధ‌మైన శిక్ష‌ణ ఇచ్చి ప‌రీక్షించారు. అవి 99శాతం క‌చ్ఛిత‌త్వంతో ఈ ప‌నిని చేయ‌గ‌లిగాయి.
  • మ‌నం చీదిన‌పుడు, ద‌గ్గుతో ఉమ్మిన‌పుడు బ‌య‌ట‌కు వెళ్లే ద్ర‌వాలు ఏనిమిది మీట‌ర్ల దూరం ప్ర‌యాణం చేస్తాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు స్లో మోష‌న్ వీడియో తీసి మ‌రీ నిరూపించారు. ఇక‌ముందు ఇలాంటి స‌మ‌యంలో టిష్యూ పేప‌ర్‌ని వాడాల‌ని, లేక‌పోతే సూక్ష్మ‌జీవులు గాల్లో ప్ర‌యాణం చేసి, అనారోగ్యాలను వ్యాపింప‌చేస్తాయ‌ని వారు చెప్పారు.
  • ఆఫీసుల్లో కూర్చుని ప‌నిచేసేవారిలో కంటే ఇత‌రుల‌తో క‌లిసిమెల‌సి గ్రూపు డిస్క‌ష‌న్స్‌లో పాల్గొనే వారిలో బ‌రువు పెరుగుద‌ల స‌మ‌స్య త‌క్కువ‌గా ఉంటుంది. ఇలాంటి ఆఫీస్ ప‌నితో పాటు త‌మ ఆహారం, వ్యాయామాల ప‌ట్ల శ్ర‌ద్ధ తీసుకున్న‌వారు త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గుతున్న‌ట్టు ప‌రిశోధ‌కులు క‌నుక్కున్నారు.
  • ఫేస్‌బుక్‌లో 300 మంది కంటే ఎక్కువ‌ ఫ్రెండ్స్ ఉన్న‌వారికి ఒత్తిడి ఎక్కువ‌గా ఉంటుంది. కానీ ఫేస్‌బుక్‌లో స్నేహితుల‌కు లైక్‌లు కొడుతూ, వారికి మంచి కామెంట్లు ఇస్తూ ఉంటే ఆ ఒత్తిడి త‌గ్గిపోతుంద‌ట‌.
  • ప్రొస్టేట్ క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు న‌ల్ల‌జాతీయుల్లో ఎక్కువ‌గా ఉంటాయి. ఈ రిస్క్ నల్ల‌జాతీయుల్లో 29.3 శాతం, శ్వేత జాతీయుల్లో 13.3శాతం, ఆసియ‌న్ల‌లో 7.9శాతం ఉంటుంద‌ని ప‌రిశోధ‌న‌ల్లో తేలింది.
  • త‌ర‌చుగా ఆపాన‌వాయువు బ‌య‌ట‌కు పోవ‌డం అనేది, న‌లుగురిలో ఉన్న‌ప్పుడు ఇబ్బందిక‌రంగా ఉన్నా, అది మ‌నం ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం తీసుకుంటున్నాం అన‌డానికి గుర్త‌ట‌. ఈ గ్యాస్ బ‌య‌ట‌కు పోక‌పోతే పొత్తిక‌డుపులో నొప్పి, క‌డుపు ఉబ్బ‌రం త‌దిత‌ర స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు చెబుతున్నారు.
  • మ‌నం పెద్ద గొంతుతో మాట్లాడుతున్న‌పుడు మ‌న మెద‌డులో మాట్లాడ‌టానికి ప‌నిచేసే భాగం ప‌నిచేయ‌డం మానేస్తుంది. నిదానంగా, ప్ర‌శాంతంగా ఆలోచ‌న‌తో కూడిన మాట‌లు మాట్లాడుతుంటే చురుగ్గా ప‌నిచేసే బ్రోకాస్ ఏరియా అనే ఈ మెద‌డు భాగం, మ‌నం పెద్ద‌గా అరుపులు అరిస్తే మాత్రం ష‌ట్‌డౌన్ అయిపోతుంది. అంటే మ‌నం రెచ్చిపోయి చేసే వాద‌న‌ల‌న్నీ మెద‌డులేని మాట‌లేన‌న్న‌మాట‌.
  • త‌ల్లిపాలు ఎక్కువ కాలం తాగిన పిల్ల‌లు మిగిలిన పిల్ల‌ల కంటే తెలివిగా ఉంటార‌ని, వారిలో తెలివితేట‌లు 30 ఏళ్లు వ‌చ్చేవ‌ర‌కు పెరుగుతూనే ఉంటాయ‌ని ప‌రిశోధ‌కులు క‌నుక్కున్నారు. 3,500 మంది పిల్ల‌ల‌పై ముప్ప‌యి సంవత్స‌రాలు ప‌రిశోధ‌న నిర్వ‌హించారు. ఈ పిల్ల‌ల్లో తెలివితేట‌ల పెరుగుద‌ల‌తో పాటు డబ్బు సంపాదించే సామ‌ర్ధ్యం, స‌మాజంలో గుర్తింపుని సాధించ‌డం వంటి గుణాలు కూడా బాగానే ఉంటాయ‌ని వారు వెల్ల‌డించారు.
  • రోజులో తొమ్మిదిగంట‌ల పాటు నిద్ర‌పోవ‌డం, ఎక్కువ స‌మ‌యం కూర్చునే ఉండ‌టం…ఈ రెండూ మ‌ర‌ణాన్ని త్వ‌ర‌గా తెచ్చిపెట్టే ల‌క్ష‌ణాల‌ని శాస్త్ర‌వేత్త‌లు గుర్తించారు. పొగ‌తాగ‌టం, జంక్‌ఫుడ్‌, ఆల్క‌హాల్ లాంటి వాటితో స‌మానంగా ఇవి హానిచేస్తాయ‌ని వారు హెచ్చ‌రించారు.
First Published:  31 Dec 2015 7:08 AM GMT
Next Story