Telugu Global
Others

బాలయ్యకు డిక్టేటర్ పూనాడు... ఎన్టీఆర్‌ను అంతమాట అనేశారు

డిక్టేటర్‌ సినిమా ప్రభావమో లేక ఆ చిత్రాన్ని ప్రమోషన్‌ చేసే తాపత్రయమో గానీ హీరో బాలకృష్ణ పదేపదే డిక్టేటర్, నియంత అన్న పదాలను విరివిగా వాడేస్తున్నారు. డిక్టేటర్ అంటే నియంత. ఆ పదాన్ని ఎక్కువగా నెగిటివ్‌ టచ్‌లో వాడుతుంటారు. హిట్లర్‌, గడాఫి వంటివారికి వాడుతుంటారు. కానీ బాలయ్య మాత్రం తనలోనూ డిక్టేటర్ లక్షణాలు ఉన్నాయని ఇటీవల చెప్పారు. అంతటితో ఆగితే పర్వాలేదు. తాజాగా తన తండ్రి ఎన్టీఆర్ కూడా నియంతేనని చెప్పారు. నియంత కాబట్టే ఎన్టీఆర్‌ హయాంలో […]

బాలయ్యకు డిక్టేటర్ పూనాడు... ఎన్టీఆర్‌ను అంతమాట అనేశారు
X

డిక్టేటర్‌ సినిమా ప్రభావమో లేక ఆ చిత్రాన్ని ప్రమోషన్‌ చేసే తాపత్రయమో గానీ హీరో బాలకృష్ణ పదేపదే డిక్టేటర్, నియంత అన్న పదాలను విరివిగా వాడేస్తున్నారు. డిక్టేటర్ అంటే నియంత. ఆ పదాన్ని ఎక్కువగా నెగిటివ్‌ టచ్‌లో వాడుతుంటారు. హిట్లర్‌, గడాఫి వంటివారికి వాడుతుంటారు. కానీ బాలయ్య మాత్రం తనలోనూ డిక్టేటర్ లక్షణాలు ఉన్నాయని ఇటీవల చెప్పారు. అంతటితో ఆగితే పర్వాలేదు. తాజాగా తన తండ్రి ఎన్టీఆర్ కూడా నియంతేనని చెప్పారు. నియంత కాబట్టే ఎన్టీఆర్‌ హయాంలో అభివృధ్ది సాధ్యమైందన్నారు. ఎన్టీఆర్‌కు లౌక్యం తెలియదని, రాజకీయాలపై పట్టులేదని కేవలం నియంతలా వ్యవహరించడం వల్లే పాలన విజయవంతమైందన్నారు. ఏపీ బీసీ కార్పొరేషన్ చైర్మన్‌గా రంగనాయకులు పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా బాలయ్య ఈ వ్యాఖ్యలు చేశారు.

YOU MAY ALSO LIKE

babu-m

ntr

First Published:  30 Dec 2015 11:26 PM GMT
Next Story