Telugu Global
Cinema & Entertainment

సంక్రాంతికే సరైనోడు

బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న మూవీ సరైనోడు. ఈ సినిమాను సమ్మర్ ఎట్రాక్షన్‌గా… బన్నీ బర్త్ డే కానుకగా ఏప్రిల్ 8, 2016న విడుదల చేయాలనుకుంటున్నారు. అయితే అంతకంటే ముందు సంక్రాంతికి సరైనోడు సందడి చేయనున్నాడు. అవును… ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ను సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే సినిమాకు సంబంధించి దాదాపు 50శాతం షూటింగ్ పూర్తయిన నేపథ్యంలో…. ప్రస్తుతం బోయపాటి శ్రీను టీజర్ ట్రయిలర్ కట్ చేసే పనిలో […]

సంక్రాంతికే సరైనోడు
X
బోయపాటి శ్రీను దర్శకత్వంలో అల్లు అర్జున్ నటిస్తున్న మూవీ సరైనోడు. ఈ సినిమాను సమ్మర్ ఎట్రాక్షన్‌గా… బన్నీ బర్త్ డే కానుకగా ఏప్రిల్ 8, 2016న విడుదల చేయాలనుకుంటున్నారు. అయితే అంతకంటే ముందు సంక్రాంతికి సరైనోడు సందడి చేయనున్నాడు. అవును… ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ను సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించారు. ఇప్పటికే సినిమాకు సంబంధించి దాదాపు 50శాతం షూటింగ్ పూర్తయిన నేపథ్యంలో…. ప్రస్తుతం బోయపాటి శ్రీను టీజర్ ట్రయిలర్ కట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడని తెలుస్తోంది. మరో 4 రోజుల్లో ఈ పని పూర్తిచేసి, సంక్రాంతికి టీజర్ ను రిలీజ్ చేస్తూ…. సినిమా విశేషాలు తెలిపేలా భారీ ప్రెస్ మీట్ పెట్టాలని అనుకుంటున్నాడు. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ సరసన రకుల్ ప్రీత్ సింగ్, క్యాథరీన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తున్నారు. హీరోయిన్ అంజలి ఓ ఐటెంసాంగ్ లో మెరవనుండగా…. రవిరాజా పినిసెట్టి కొడుకు ఆది పినిసెట్టి… ఈ సినిమాతో విలన్ గా పరిచయమౌతున్నాడు. సాయికుమార్, రాజీవ్ కనకాల కూడా కీలకపాత్రల్లో కనిపిస్తారు.
Also Read the following
hero-ram
dictator-bali
First Published:  30 Dec 2015 7:05 PM GMT
Next Story