Telugu Global
National

చత్తీస్ గఢ్ స్థానిక ఎన్నికలలో బీజేపీ పరాజయం

  స్థానిక సంస్థల ఎన్నికలు బీజేపీ కలిసి రావడంలేదు. ఏ రాష్ట్రంలో స్థానిక సంస్థలు జరిగినా బీజేపీకి ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న చత్తీస్ గఢ్ లో పట్టణ ప్రాంతాలలోని 11 స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితే బీజేపీ నాలుగు స్థానాలలో మాత్రమే గెలిచింది. కాంగ్రెస్ ఏడు స్థానాలను కైవశం చేసుకుంది. డిసెంబర్ 28 న ఆరు నగర పంచాయితీలకు, నాలుగు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. ఆరు నగర పంచాయితీల్లో మూడు బీజేపీకి, మూడు […]

చత్తీస్ గఢ్ స్థానిక ఎన్నికలలో బీజేపీ పరాజయం
X

స్థానిక సంస్థల ఎన్నికలు బీజేపీ కలిసి రావడంలేదు. ఏ రాష్ట్రంలో స్థానిక సంస్థలు జరిగినా బీజేపీకి ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. బీజేపీ అధికారంలో ఉన్న చత్తీస్ గఢ్ లో పట్టణ ప్రాంతాలలోని 11 స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితే బీజేపీ నాలుగు స్థానాలలో మాత్రమే గెలిచింది. కాంగ్రెస్ ఏడు స్థానాలను కైవశం చేసుకుంది. డిసెంబర్ 28 న ఆరు నగర పంచాయితీలకు, నాలుగు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. ఆరు నగర పంచాయితీల్లో మూడు బీజేపీకి, మూడు కాంగ్రెస్ కు దక్కాయి. అంతకు ముందుకన్నా బీజేపీకి రెండు నగర పంచాయితీలు తగ్గాయి. ప్రతిష్ఠాత్మకమైన భిలాయ్ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పదవిని కూడా బీజేపీ దక్కించుకోలేక పోయింది.

ఇటీవల మధ్య ప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలలో పట్టణ ప్రాంతాలలోని ఎనిమిది స్థానిక సంస్థలలో కాంగ్రెస్ అయిదింటిని స్వాధీనం చేసుకుంది. మధ్యప్రదేశ్ లో బీజేపీ మూడో విడత అధికారంలో కొనసాగుతోంది. చత్తీస్ గఢ్ లో కాంగ్రెస్ జముల్, ఖైరా గఢ్, వైకుంఠ పూర్, శివపూర్-చర్చ మున్సిపాలీటిలలో విజయం సాధించింది.

భిలాయ్ మున్సిపల్ కార్పొరేషన్ పదవికి పోటీ చేసిన ప్రస్తుత బీజేపీ శాసన సభ్యుడు విద్యారతన్ కాంగ్రెస్ అభ్యర్థి దేవేంద్ర యాదవ్ చేతిలో ఓడిపోయారు.

చత్తీస్ గఢ్ ముఖ్యమంత్రి డా. రమణ్ సింగ్ పై ప్రజలలో వ్యతిరేకత, అభ్యర్థుల నిర్ణయంలో అంతర్గత విభేదాలు కాంగ్రెస్ కు ఉపకరించాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేశ్ బాగెల్ వ్యాఖ్యానించారు.

First Published:  31 Dec 2015 7:03 PM GMT
Next Story