Telugu Global
NEWS

నిరుద్యోగులకు కొలువులు " సామాన్యులకు వరాలు

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలందరికీ కొత్త సంవత్సర కానుక ఇవ్వబోతోంది. ఇప్పటికే నిరుద్యోగుల కోసం ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ ఏడాది మరిన్ని కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కాంట్రాక్టు,  ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా కొత్త ఏడాదిలో వరాలు ప్రకటించనున్నారు. శనివారం జరిగే కేబినెట్ సమావేశం నాటికి అన్ని శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలు […]

నిరుద్యోగులకు కొలువులు  సామాన్యులకు వరాలు
X
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలందరికీ కొత్త సంవత్సర కానుక ఇవ్వబోతోంది. ఇప్పటికే నిరుద్యోగుల కోసం ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ ఏడాది మరిన్ని కొత్త ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు కూడా కొత్త ఏడాదిలో వరాలు ప్రకటించనున్నారు. శనివారం జరిగే కేబినెట్ సమావేశం నాటికి అన్ని శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగుల వివరాలు సిద్ధం చేయాలని కేసీఆర్ ఆదేశించారు. త్వరలోనే డీఎస్సీ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని సూచించారు.
ఉద్యోగాల జాతర
2016లో నిరుద్యోగులకు ముఖ్యంగా డీఎస్సీ అభ్యర్థులకు కేసీఆర్ గుడ్ న్యూస్ చెప్పారు. వేలాది కొత్త టీచర్ ఉద్యోగాల భ‌ర్తీకి టీఎస్ స‌ర్కార్ సిద్ధమవుతోంది. ఇప్పటికే నిరుద్యోగులు ఎదురు చూస్తున్న గ్రూప్ 2 నోటిఫికేష‌న్ ఇప్పటికే విడుదలైంది. త్వరలోనే ఉపాధ్యాయులు, పోలీస్ ఉద్యోగాల భ‌ర్తీ కూడా జరుగుతుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు. 15 వేల నుంచి 20వేల టీచర్ పోస్టులకు డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడుతుందని తెలుస్తోంది. ఇక పోలీసు శాఖ‌లో 9వేల పోస్టుల‌ను భ‌ర్తీ చేయాల‌ని కేసీఆర్ ఆదేశించారు. దీంతో కొత్త ఏడాదిలో సుమారు 30వేలకు పైగా ఉద్యోగాలు భ‌ర్తీ కానున్నాయి.
9వేల కానిస్టేబుల్ పోస్టులు
ఇప్పటికే పోలీస్ కానిస్టేబుళ్ల నియామకాలకు కూడా నోటిఫికేషన్ వెలువడింది. 9వేల 281 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి పోలీస్‌శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో సివిల్ విభాగంలో 1810 పోస్టులు, ఆర్మ్‌డ్ రిజర్వ్ విభాగంలో 2760 పోస్టులు, టీఎస్‌ఎస్‌పీలో 4,065 పోస్టులు కూడా ఉన్నాయి. సివిల్ నియామకాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్ కల్పించారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన నియామక పద్ధతులకు స్వస్తి చెప్పేసినట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ప్రిలిమినరీ పరీక్ష, తర్వాత సాధారణ దేహదారుడ్య పరీక్ష, అనంతరం మెయిన్స్ నిర్వహించి నియామకాలు చేపడతామని నోటిఫికేషన్‌లో ప్రకటించారు.
ఆస్తిపన్ను తగ్గింపు
కేవలం ఉద్యోగులకే కాదు.. ఈ ఏడాది సామాన్యులకు కూడా కొత్త ఏడాదికి గుడ్ న్యూస్ చెప్పారు సీఎం కేసీఆర్. ఆస్తిప‌న్నుపై డిస్కౌంట్ ప్రకటించారు. 1200 రూపాయ‌ల లోపు ఆస్తిపన్న కట్టేవారు కేవలం101 రూపాయ‌లు చెల్లిస్తే స‌రిపోతుంది. అదేవిధంగా న‌ల్లాబిల్లు, క‌రెంటు బిల్లుల బ‌కాయిలు ర‌ద్దు చేయాల‌ని ఇప్పటికే కేసీఆర్‌ ఆదేశించారు. శనివారం జరిగే కేబినెట్ మీటింగ్ తర్వాత అధికారికంగా ఉత్తర్వులు రానున్నాయి. మొత్తం మీద 2016 సంవత్సరం తెలంగాణలోని నిరుద్యోగులు, కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కలిసొచ్చిందని చెప్పవచ్చు.
First Published:  31 Dec 2015 1:00 PM GMT
Next Story